ఆ హీరోయిన్ కు అలవాట్ల సమస్య?

అందమైన హీరోయిన్ గా పేరు. ఆరంభంలో ఐరన్ లెగ్ అన్నా, తరువాత గోల్డెన్ లెగ్ అన్నారు. కానీ ఇప్పుడు రాను రాను ఆమెను చూస్తుంటే, గ్లామర్ గ్రామర్ మరిచి పోయినట్లు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.…

అందమైన హీరోయిన్ గా పేరు. ఆరంభంలో ఐరన్ లెగ్ అన్నా, తరువాత గోల్డెన్ లెగ్ అన్నారు. కానీ ఇప్పుడు రాను రాను ఆమెను చూస్తుంటే, గ్లామర్ గ్రామర్ మరిచి పోయినట్లు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం మరేమీ కాదని, ఆ హీరోయిన్ అలవాట్లేనని గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అర్థరాత్రి దాటేవరకు నిద్రపోకపోవడం, నిత్యం కాస్త 'పుచ్చుకునే' అలవాటు, ఇవన్నీ కలిసి ఆమెను డీ గ్లామర్ గా తయారుచేసాయన్న టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె నటించిన సినిమాల గ్లామర్ తో చూసుకుంటే, ఈ సినిమాలో ఆమె అస్సలు అందంగా లేదన్నది జనాల అభిప్రాయం.

ఇది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే ఆమె గ్లామర్ మాత్రం పూర్తిగా మటాష్ అయిపోయిందని మాత్రం విడుదలయిన ఓ సినిమా చెప్పకనే చెబుతోంది. కోటిన్నర వసూలు చేసే ఆ హీరోయిన్ డేట్ లు అడ్జస్ట్ చేయగలగాలే కానీ, తెలుగులో ఆఫర్లు వెల్లువత్తేంత సీన్ వుంది. కానీ ఇప్పుడు ఈ డీ గ్లామర్ వ్యవహారంతో అంత సీన్ మాయమయిపోతోంది.