పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో తన 101వ చిత్రాన్ని చేస్తోన్న బాలకృష్ణ ఈ చిత్రం దసరాకి రిలీజ్ అవుతుందని ముందే ప్రకటించేసారు. ముందుగా ఆ డేట్‌ని రిజర్వ్ చేసుకున్నామంటూ మిగతా వాళ్లు పోటీకి రాకుండా హింట్ కూడా ఇచ్చారు. అయితే పెద్ద సినిమాలు విడుదల చేసుకోవడానికి వున్నవే మూడు సీజన్లు కావడంతో ఒక సినిమా కోసం మరొకటి వాయిదా వేసుకునే పరిస్థితి లేదు.
బాలయ్య సినిమా రిలీజ్ వుందని తెలిసినా కానీ ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా అప్పుడే రిలీజ్ చేసేలాగున్నారు. 'జై లవకుశ' చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లడానికి కాస్త సమయం పట్టింది. మరో మూడు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తయ్యే దాఖలాలు కనిపించడం లేదు.
కనుక ముందుగా అనుకున్నట్టు ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడం కష్టమనేది ఇండస్ట్రీ టాక్. సెప్టెంబర్ నెలాఖరులో, అంటే దసరాకే ఈ చిత్రం కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువట. అదే జరిగితే మళ్లీ బాబాయ్, అబ్బాయ్ మధ్య క్లాష్ వచ్చి నందమూరి అభిమానులు ఇరకాటంలో పడిపోతారు. ఇంతకుముందు వీరిద్దరి సినిమాలు 'డిక్టేటర్', 'నాన్నకు ప్రేమతో' బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయిన సంగతి తెలిసిందే. దీనిని అవాయిడ్ చేయడానికి ఇరు చిత్రాల రూపకర్తలు ప్రయత్నిస్తారో, లేక దసరా కంటే మంచి సీజన్ వుండదని క్లాష్‌కే సిద్ధపడతారో చూడాలి.