పవన్‌ టార్గెట్‌ 150 కోట్లు

ప్రతి మనిషికి ఓలక్ష్యం వుంటుంది. అలాగే ప్రతి హీరోకు కూడా ఓ టార్గెట్‌ వుంటుంది. ఇన్ని సినిమాలు చేయాలి. ఇలా ముందుకు సాగాలి. ఇంత సంపాదించాలి అని. అదేమీ తప్పుకాదు. లక్ష్యంలేని పయనం వృధా…

ప్రతి మనిషికి ఓలక్ష్యం వుంటుంది. అలాగే ప్రతి హీరోకు కూడా ఓ టార్గెట్‌ వుంటుంది. ఇన్ని సినిమాలు చేయాలి. ఇలా ముందుకు సాగాలి. ఇంత సంపాదించాలి అని. అదేమీ తప్పుకాదు. లక్ష్యంలేని పయనం వృధా కదా?

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు కూడా ఇప్పుడు ఓ టార్గెట్‌ ఫిక్సయిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి 2020 మధ్యలో సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్లపాటు పవన్‌ సినిమా ఇండస్ట్రీకి దూరంగా వుండాల్సి వస్తుందని టాక్‌. ఎందుకంటే జనసేన పార్టీ కోసం, అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన కసరత్తు చేయాల్సి వుంటుంది. ఆ వేళ పరిస్థితిని బట్టి అవసరం అయితే ప్రభుత్వంలో కీలకపాత్ర వహించాల్సి కూడా వుంటుంది.

ఈ విషయాన్ని పవన్‌ సోదరుడు నాగబాబు దృవీకరిం చారు కూడా. ఇటీవల ఓ ఇంటర్వూలో ఆయనే చెప్పారు. ఎన్నికల వల్ల, జనసేన వల్ల రెండేళ్లు గ్యాప్‌ వచ్చినా పవన్‌కు పెద్దసమస్య కాదని. అయితే ఈ ముచ్చట అలా వుంచితే ఎన్నికల కోసం సినిమాలకు గ్యాప్‌ ఇచ్చేలోగా కనీసం 200 కోట్లు సంపాదించాలన్నది పవన్‌ లక్ష్యం అని ఇండస్ట్రీ టాక్‌.

అదెలా అంటే..

పవన్‌ రెమ్యూనిరేషన్‌ 20 కోట్ల దగ్గరగా వుంది. అయితే కేవలం సినిమాల్లో నటిస్తే 20కోట్లు మాత్రమే వస్తుంది. అదే సినిమాలో పార్టనర్‌గా వుంటే. అందుకే ఆయన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాను స్వయంగా నిర్మిం చారు. ఆ సినిమాకు ఆయనకు అన్నీ కలిపి పాతికకోట్ల వరకు వచ్చిందని గుసగుసలు వున్నాయి. ఇప్పుడు మళ్లీ కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా ఆయన కనిపించని భాగస్వామి అని టాక్‌. ఎందుకంటే శరత్‌మరార్‌ ఆయనకు అత్యంత సన్ని హితుడు, ఆప్తుడు ఇంకా అన్నీ. అందువల్ల ఈ సినిమాలో కూడా ఆయనకు పాతికకోట్లు కిట్టుబాటు అవుతుంది. పైగా ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌లో తీసి, ఎక్కువ మొత్తాలకు విక్రయించారు.

తరువాత ఏంటీ?

తరువాతి సినిమా హారిక హాసిని సంస్థతో. అక్కడ మాత్రం అలాంటి లావాదేవీలు ఏవీకుదరవు. రెమ్యూని రేషన్‌ ఇరవైకోట్లు తీసుకుని సినిమా చేసేయడమే. అంటే సర్దార్‌, కాటమరాయుడు, హారిక హాసిని సినిమాలతో 70 కోట్ల రూపాయిల ఆదాయం సమకూరినట్లే. ఆ తరువాత కూడా ఆయన చేతిలో ఫిక్స్‌డ్‌గా రెండు సినిమాలు రెడీగా వున్నాయి. కానీ ఇప్పుడు పవన్‌ వాటి మధ్యలో ఓ సినిమా అయినా తన భాగస్వామ్యం వుండేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేస్తే, మరో అయిదుకోట్లు అదనంగా ఆదాయం వస్తుంది. అయితే మళ్లీ శరత్‌మరా ర్‌కే అంటే అంత బాగుండదు. అందుకే ఈసారి మరెవ రినైనా సీన్‌లోకి తేవాలని ఆలోచిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

గతంలో పవన్‌ తరపున గబ్బర్‌సింగ్‌ సినిమా అందిం చాడు బండ్లగణేష్‌. నిర్మాతగా బండ్లగణేష్‌ పేరే అయినా, తెరె వెనుక లెక్కలు వేరే వున్నాయని వదంతులు వుండనే వున్నాయి. అప్పుడు లెక్కలు తేడా వచ్చాయనే బండ్లను పవన్‌ దూరం పెట్టారని టాక్‌. ఇప్పుడు మళ్లీ బండ్ల పవన్‌కు దగ్గరఅయ్యారు. అందుకే అతని బ్యానర్‌పై ఓ సినిమా చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

హారిక హాసిని, మైత్రీ మూవీస్‌, ఏఎమ్‌ రత్నం సిని మాలు 2018 చివరిలోగా చేసేయడానికి పూర్తి అవ కాశం వుంది. ఏమాత్రం స్పీడప్‌ చేసినా మరో సినిమా చేసేయచ్చు. ఎందుకంటే 21నెలల సమయం వుంది. సినిమాకు నాలుగు నెలల కాల్‌ షీట్లు ఇచ్చినా నాలుగు సినిమాలు చేయచ్చు. అందుకే హారిక హాసిని తరువాత ఏఎమ్‌ రత్నం సినిమా బదులు పవన్‌ భాగస్వామ్యంలోని సినిమా స్టార్ట్‌ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

టోటల్‌గా..
సర్దార్‌, కాటమరాయుడు, హారికహాసిని, మైత్రీ, ఏఎమ్‌ రత్నం, ప్లస్‌ ప్లాన్‌ చేస్తున్న సినిమా కలిపితే, 130కోట్ల వరకు పారితోషికాలు అందే అవకాశం వుంది. అయితే దీన్ని ఎలాగైనా మరికాస్త ముందుకు సాగదీయాలని, అవకాశం వుంటే 2018 ఎన్నికలకు జస్ట్‌ ముందుదాకా కూడా ఓ సినిమా చేసి మరింత ఆదాయం తెచ్చుకుంటే, రెండేళ్లు గ్యాప్‌ వచ్చినా, ఆపై పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయినా ఫరవాలేదన్నది పవన్‌ ఆలోచనగా తెలుస్తోంది. నిజానికి ఇదేమీ పెద్ద టార్గెట్‌ కాదు. పవన్‌కు వున్న ఇమేజ్‌కు ఆయన చకచకా సినిమాలు చేసిన పక్షంలో ఏడాదికి రెండు సినిమాలు సులువుగా చేసేయ గలరు. మధ్యలో కాస్త అడ్జస్ట్‌ చేస్తే, రెండేళ్లకు అయిదు చేయగలరు. అంటే వందకోట్లు. ఆల్రెడీ రెండు సినిమాలకు సంపాదించింది 50కోట్లు.

పార్టీకి అవసరం లేదు

ఒకప్పుడు పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి. పవన్‌ అంటూ వుంటారు. తన దగ్గర డబ్బులులేవు అని. మరి తీసుకున్న పారితోషికాలు, అడ్వాన్స్‌లు ఎటుపోయినట్లు. అయినా అది ఆయన వ్యక్తిగతం. అయితే పార్టీ నడప డానికి డబ్బులు లేవు అంటారు. అది మాత్రం కరెక్ట్‌ కాదు. ఎందుకంటే పార్టీ నడపడానికి ఎదురు డబ్బులు పెట్టేవారు బోలెడు మంది. అంతెందుకు జనసేన ఆరం భంలో మొత్తం ఖర్చు ఎవరు భరించారు. విజయవాడ టికెట్‌ ఆశించి పారిశ్రామికవేత్త పీవీపీనే కదా.

అలాగే ఇప్పుడు ఎందరో ఆశావహులు రెడీగా వున్నారు. ఖర్చులు భరించడానికి. అందువల్ల పవన్‌ తన ఇంట్లో సొమ్ము, తన సంపాదన రూపాయి కూడా జనసేన కోసం ఖర్చు చేయనక్కరలేదు. పైగా పోటీ చేసేవాళ్లే కాదు… స్పాన్సర్లు బోలెడు మంది వుంటారు. అంతెందుకు ఓ మీడియా అధినేత కారు కొని పవన్‌కు అందివ్వలేదా? అలా భవిష్యత్‌ అవసరాలను దష్టిలో వుంచుకుని సహాయం చేసేవాళ్లకు కొదవలేదు. సో సినిమాల సంపాదన రూపాయి కూడా జనసేనకు పెట్టనక్కరలేదు. హ్యాపీగా 150కోట్లు తన కోసం, తన పిల్లల భవిష్యత్‌ కోసం పవన్‌ జాగ్రత్త చేసుకోవచ్చు. ఇప్పటికే ఇందులో భాగంగా గతంలోనే తీసుకున్న అడ్వాన్స్‌లతో పవన్‌ హైదరాబాద్‌ సిటీలో కొన్ని ఆస్తులు కొనుగోలు చేసారని గుసగుసలు కూడా వున్నాయి. మొత్తం మీద అసెంబ్లీలో 100 సీట్లు వస్తే అధికారం. ఈలోగా 150కోట్లు వస్తే భవిష్యత్‌ పదిలం.

ఆర్వీ