ఖర్చు ఒకరిది..కథ ఇంకొకరికి

ఇండస్ట్రీలో ఇప్పుడు కథలకు కరువోచ్చి పడింది. కాస్త నోటెడ్ డైరక్టర్ల దగ్గర పని చేసే అసిస్టెంట్లు కనుక ఓ రేంజ్ కథ తయారు చేసుకుంటే డైరక్షన్ ఛాన్స్ సులువయిపోతుంది. డైరక్టర్ల వద్ద పని చేస్తూనే,…

ఇండస్ట్రీలో ఇప్పుడు కథలకు కరువోచ్చి పడింది. కాస్త నోటెడ్ డైరక్టర్ల దగ్గర పని చేసే అసిస్టెంట్లు కనుక ఓ రేంజ్ కథ తయారు చేసుకుంటే డైరక్షన్ ఛాన్స్ సులువయిపోతుంది. డైరక్టర్ల వద్ద పని చేస్తూనే, పనిలో పనిగా హీరోల గుడ్ లుక్స్ లోకి వెళ్లి, అవకాశం చూసుకుని లైన్ చెబుతుంటారు అసిస్టెంట్లు. లైన్ బాగుంటే, హీరోలు, సరే డెవలప్ చేయమంటారు. ఆ విధంగా అవకాశం రావడానికి చాన్స్ వుంటుంది.

మరికొంత మంది హీరోలు కాస్త పెట్టుబడి పెట్టి మరీ కథలు తయారు చేయించుకుంటారు. అవసరం వాళ్లది కనుక. కానీ పెద్ద హీరోలయితే మాత్రం రూపాయి ఇవ్వకున్నా, అప్పుచేసి మరీ ఖర్చులు భరించి కథ తయారు చేసుకుంటారు ఈ అసిస్టెంట్లు.

ఇదిలా వుంటే కమెడియన్ నుంచి హీరోగా మారిన ఓ నటుడికి ఓ లైన్ చెప్పాడట ఓ అసిస్టెంట్. బానే వుందన్నాడట హీరో. కష్టాల్లో వున్నాను, డెవలప్ చేస్తాను కాస్తసాయం చేయండి అంటే మూడో నాలుగో లక్షలు చేతిలో పెట్టాడట. అయితే తీరా చేసి కథ రెడీ అయ్యాక, హీరో చిన్న చిన్న మార్పులు చెప్పాడట. మరి ఆ మార్పులు చేయడం ఇష్టంలేదో? లేక ఆ హీరోతో కన్నా మరెవరితో అయినా అయితే బాగుంటుంది అనుకున్నాడో? ఆ కథతో అక్కడ నుంచి జంప్ అయి, మరో క్యాంప్ లో తేలాడట. ఆ కథను తీద్దామనుకున్న నిర్మాతకు పైసలు సెటిల్ చేసాడట కానీ, హీరోకి మాత్రం ఇవ్వలేదని వినికిడి.

తన దగ్గర లేకపోయినా, కథ తయారు చేస్తానుకదా అన్నాడని పైసలు ఇచ్చానని, ఇప్పుడు ఇలా చేసాడని, ఈ రోజుల్లో ఎవరికీ సాయం చేయకూడదని బాధపడుతున్నాడట సదరు హీరో. అయినా ఆ డైరక్టర్ అలా చేయడం ఏమిటో?