‘మెరుగైన భజన’ కోసం.!

పవన్‌కళ్యాణ్‌ పక్కన ఆయన చేరారు.. 'మెరుగైన భజన' మొదలు పెట్టేశారు. ఇక, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి ఏంటట.? 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఓ ఛానల్‌ అధినేత కన్పించగానే, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లో తలెత్తిన…

పవన్‌కళ్యాణ్‌ పక్కన ఆయన చేరారు.. 'మెరుగైన భజన' మొదలు పెట్టేశారు. ఇక, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి ఏంటట.? 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఓ ఛానల్‌ అధినేత కన్పించగానే, పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లో తలెత్తిన ఆందోళన ఇది.! 

'సందర్భోచితం' అన్న మాట పక్కన పెట్టేసి, 'కాటమరాయుడు' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రాజకీయాలు మాట్లాడేశారు. పార్టీ పెట్టి, టీడీపీ – బీజేపీకి మద్దతిచ్చినా.. పదవి కోసం ఆశపడని పవన్‌ నైజం ఆయనకు నచ్చిందట. ఇప్పటినుంచే, ఈ క్షణం నుంచే పవన్‌కళ్యాణ్‌ని ఆయన అభినందించడం మొదలు పెట్టేశారట. పెద్ద పాత నోట్ల రద్దు వ్యవహారం గురించీ, ప్రత్యేక హోదా గురించీ పవన్‌ ప్రశ్నించడాన్ని ప్రశ్నించేశారాయన. 

చిత్రమైన విషయమేంటంటే, పవన్‌కళ్యాణ్‌ని వీలైనంతగా 'డీ గ్రేడ్‌' చేయడానికి తన ఛానల్‌ని ఇప్పటిదాకా వాడుకున్న ఆయనే, ఇప్పుడు చిత్రంగా పవన్‌కళ్యాణ్‌కి మద్దతిస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌, జనసేనను బలోపేతం చేయనున్న దరిమిలా, 'రాజకీయ అవసరాల కోసం' బహుశా ఆయనగారిప్పుడు, పవన్‌ పంచన చేరారేమో అన్న అనుమానాలు బలపడ్తున్నాయి. 

మొత్తమ్మీద, ఈ 'మెరుగైన భజన' పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకే పెద్ద షాక్‌ ఇచ్చేసిందన్నమాట. ఇంతకీ, రాజకీయంగా పవన్‌ ఆయన్ని పంచన చేర్చుకుంటారా.? వేచి చూడాల్సిందే.