టెక్నాలజీ బాగా విసృతం అయ్యాకా.. ప్రతి చేతికీ స్మార్ట్ఫోన్లు, ఆ ఫోన్లకు ఇంటర్నెట్ సదూపాయం వచ్చాకా.. పలకరింపులతో మొదలైన చాటింగ్, క్రమంగా సెక్స్టింగ్గా మారింది. మొదట్లో సెక్స్టింగ్ అనే పదం ఏదీలేదు.. చాటింగ్‌లో సెక్స్ విషయాలు మాట్లాడుకోడం ఎక్కువయ్యాకా.. సెక్స్టింగ్ అనే వర్డ్‌ను కాయినింగ్ చేశారు భాషాజ్ఞానులు. మరి ఈ సెక్స్టింగ్లో భాగస్వామ్యులు కాని నెటిజన్లను పట్టుకోవడం కొంచెం కష్టమే. జీవిత భాగస్వామితో సెక్స్టింగ్ చేసుకునే రొమాంటిక్ పర్సన్లతో మొదలుపెడితే, ప్రేమ దశలోనో.. ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్‌తోనే సెక్స్టింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో ఇంటర్నెట్లో యమ హాట్సైట్ ఏది? అంటే.. దానికి 'వాట్సాప్'ను సమాధానంగా ఇవ్వాల్సి వస్తోంది. అవును మరి.. ఎలాంటి పోర్న్ వీడియోలను, సెక్స్ కంటెంట్‌ను కలిగి ఉండకపోయినా.. ఇంటర్నెట్లో హాట్ వెబ్సైట్ అంటే అది వాట్సాప్ మాత్రమే! ఇంటర్నేషనల్ లెవల్ నుంచి చూసుకొంటూ వచ్చినా జనాలు ఎక్కువగా సెక్స్చాట్ చేస్తున్నది వాట్సాప్ ద్వారానే మరి. అందుకే వాట్సాప్‌ను యమహాట్ వెబ్సైట్ అని చెప్పాల్సి వస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో స్త్రీపురుషుల్లో ఈ సెక్స్టింగ్ హ్యాబిట్ గురించి అధ్యయనం చేసింది ఒక అధ్యయన సంస్థ. దాని లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. సెక్ట్సింగ్ హ్యాబిట్లో పురుషులే సహజంగా ముందున్నారని ఈ సర్వే తేల్చింది. దీని లెక్కల ప్రకారం నలభైమూడు శాతం మంది పురుషులు ఒక దశలో తాము సెక్ట్సింగ్ చేశామని ఒప్పుకున్నారట. సర్వేలో భిన్నవయసుల వారు, భిన్నమైన నేపథ్యాల వారు పాల్గొన్నా.. ఏకంగా ఇంత శాతం మంది సెక్స్టింగ్లో భాగస్వామ్యులయ్యారంటే ఈ శాతం ఎక్కువగా ఉన్నట్టే.
మహిళల విషయానికి వస్తే.. ఇరవైఆరు శాతం మంది తమకు సెక్స్టింగ్ అలవాటు ఉందని చెప్పారట. మరి స్మార్ట్‌ఫోన్ యూసేజ్ విషయంలో గృహిణిలు వెనుకబడే ఉన్న భారతదేశంలో ర్యాండమ్‌గా ఇరవైఆరు శాతం మంది సెక్స్టింగ్ హ్యాబిట్ ఉందని చెప్పారంటే.. మనోళ్లు ఎక్కడా వెనుకబడి లేరని అనుకోవాల్సి వస్తోంది.
ఈ అలవాటును కలిగిన స్త్రీ పరుషుల్లో కొంతమంది కేవలం పదాలతో ఆగడంలేదట.. తమ తమ సెక్సీ ఫొటోలను ఈ చాటింగ్‌లో షేర్ చేసుకోవడానికి వారు ఉత్సాహం చూపిస్తున్నారట. తాము నగ్నంగా, అర్ధనగ్నంగా తీసుకున్న సెల్ఫీలను తమ పార్టనర్‌తో షేర్ చేసుకోవడం వీరికి అలవాటట. గణాంకాల పరంగా చూస్తే.. పదిశాతం మంది తాము అలాంటి షేరింగ్స్‌తో కూడిన చాటింగ్ చేస్తామని వివరించారట.