దిల్లీని లండన్‌ చేసేస్తా.. క్రేజీవాల్‌

మన రాజకీయనాయకులు అడపాదడపా ఇలాంటి తుగ్లక్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటం మనం రెగ్యులర్గా మీడియాలో చూస్తూనే వుంటాం.ఆ మధ్య మమతా బెనర్జీ కూడా ఇలాగే ఆవేశపడింది. Advertisement దిల్లీని లండన్‌ గా మార్చే సీను ఇలా…

మన రాజకీయనాయకులు అడపాదడపా ఇలాంటి తుగ్లక్‌ స్టేట్‌మెంట్స్‌ ఇవ్వటం మనం రెగ్యులర్గా మీడియాలో చూస్తూనే వుంటాం.ఆ మధ్య మమతా బెనర్జీ కూడా ఇలాగే ఆవేశపడింది.

దిల్లీని లండన్‌ గా మార్చే సీను ఇలా వుంటుంది.

*మేయర్‌ గారూ.. మన ధిల్లీ రోడ్లు కూడా లండన్‌ రోడ్ల లాగా వుండాలి..  ఎక్కడా చెత్త వుండకూడదు..  అని చెప్పాను కదా..  మరి ఇక్కడ ఈ రోడ్డంతా ఏమిటీ చెత్త?

ఇదంతా ఈ రోడ్‌ మీదుండే దుకాణాల వాళ్ళు చేస్తున్న న్యూసెన్స్‌ సర్‌.. మనకేమీ సంబంధం లేదు.. 

*మరి వాళ్ళమీద ఎందుకు యాక్షన్‌ తీసుకోవటం లేదు? వెంటనే కేసులు ఫైన్లు వేయండి.. జైలుకి పంపించండి.

అలాగే సార్‌.. ఇప్పుడే ఆర్డర్స్‌ ఇచ్చేస్తా.. 

*సెక్రెటరీ ఖంగారుగా క్రేజీవాల్‌ చెవిలో ఊదాడు.. 

సార్‌.. ఆ దుకాణాల వాళ్ళందరూ మనకు ఓటేసిన వాళ్ళే.. వాళ్ళ మీద యాక్షన్‌ తీసుకుంటే వచ్చే ఎలక్షన్స్‌లో మనం..

*అర్ధమయింది.. ఆ చూడండి మేయర్‌.. వాళ్ళ మీద యాక్షన్‌ తీసుకోవద్దు.. కొంతకాలం వాళ్లకు నేనే కౌన్సిలింగ్‌ చేస్తా.. 

ఓకే సార్‌.. 

*మన ధిల్లీ లండన్‌ అవాలంటే ముందు రోడ్లమీద ఈ పొల్యూషన్‌ కంట్రోల్‌ చేయాలి మేయర్‌ గారూ.. 

అయితే వెంటనే పదేళ్ళు పైబడ్డ మోటార్‌ వెహికల్స్‌ అన్నీ బాన్‌ చేసేస్తా.. 

వండరు ఐడియా.. 

సెక్రటరీ మళ్ళీ చెవి కొరికాడు.

సార్‌..  అలా చేస్తే వచ్చే ఎలక్షన్స్‌లో మన పార్టీ మట్టి కొట్టుకుపోతుంది.. 

*అలాగా.. ఓకే.. మేయర్‌.. ఆ డెసిషన్‌ పోస్ట్‌ పోన్‌ చేయండి.. వాట్‌ నెక్స్ట్‌?

మన ధిల్లీ లండన్‌ లాగా అవాలంటే ట్రాఫి జామ్స్‌ లేకుండా చూడాలి.. అన్నాడు మేయర్‌.

*అయితే రోడ్స్‌ పెద్దవిగా చేసేద్దాం.. 

సార్‌.. మనదగ్గర అంత మనీలేదు.. సెక్రటరీ చెప్పాడు.. 

*అయితే వదిలేద్దాం..  వాట్‌ నెక్స్ట్‌? మేయర్‌ గారూ..  

మన సిటీ లండన్‌లాగా ఉండాలంటే అన్ని రోడ్లపక్కనా చెట్లు పెట్టాలి సార్‌..  

*ఓకే.. విదేశాలనుంచి పదికోట్ల మొక్కలు తెప్పిద్దాం.. 

సెక్రటరీ షాకయ్యాడు.. సార్‌.. మనకి అసలే వాటర్‌ షార్టేజ్‌.. తాగటానికే నీళ్ళులేవు.. చెట్లకెలా పోస్తాం? 

*అవును.. అయితే మంచినీళ్ళు కూడా చైనా నుంచి ఇంపోర్ట్‌ చేసుకుందాం.. అక్కడ చాలా చౌకగా వస్తాయ్‌ అని చెప్తున్నారు.. 

సార్‌.. అవి శుభ్రపరచిన డ్రైనేజ్‌ నీళ్ళు.. జనం చస్తారు.. 

*అలాగా.. అయితే వదిలేద్దాం.. అన్నట్లు మేయర్‌ గారూ.. ఈ స్లమ్స్‌ అన్నీ డిస్‌ మాంటిల్‌ చేసి లండన్లో లాగా అందమైన ఇళ్ళు కట్టిద్దాం.. 

సెక్రటరీ ఉలిక్కి పడ్డాడు.. 

గోవిందా.. గోవిందా.. అరచాడు సెక్రటరీ.. 

*కేజ్రీ ఉలిక్కి పడ్డాడు.. ఏంటలా అరచావ్‌?

మన దేశంలో స్లమ్స్‌ జోలికెల్తే ఔట్‌ .. 

*ఈ లెక్కన మనం దిల్లీని లండన్‌గా ఎలా మారుస్తాం.. 

అలా అని మీరు స్టేట్మెంట్‌ ఇవ్వటంలో తప్పులేదు సార్‌.. నిజంగా చేయాలనుకోవటం తప్పు.. 

*నో.. నో..  క్రేజీవాల్‌ ఒకసారి స్టేట్మెంట్‌ ఇస్తే వందసార్లు ఇచ్చినట్లే.. ప్రామిస్‌ చేసానంటే ఆ పని చేసి తీరాల్సిందే.. 

అయితే ఒకపని చేద్దాం సార్‌.. 

*ఏంటది?

దిల్లీని లండన్‌గా మార్చడం ఎవడివల్లా కాదు సార్‌.. అందుకని లండన్‌ ని ధిల్లీగా మార్చేద్దాం.. 

*కాని మనమెలా మార్చగలం?

ఈజీ సార్‌.. మీరు వెళ్లి దిల్లీలో వున్న మనవాల్లందర్నీ కలుపుకుని అక్కడి ప్రజల్లో బీజాలు నాటారంటే మూడు నెలల్లో లండన్‌ ధిల్లీ అయిపోతుంది.. 

*కానీ అక్కడ మనవాళ్ళు ఎవరున్నారు?

భలేవాళ్ళే సార్‌.. మనదేశంలో మర్డర్లు, రేప్‌లు, ఫ్రాడ్‌ లు, మోసాలు, చీటింగ్‌ లూ,చేసినవాళ్ళూ.. అవినీతి కేసుల్లో జైలు శిక్షలు పడ్డవాళ్ళూ.. అందరూ అక్కడే సెటిలయ్యారు సార్‌.. వాళ్ళు ఇప్పటికే లండన్‌ని సగం ధిల్లీగామార్చేసారు.. మిగతాసగం..

క్రేజీవాల్‌ క్రేజీగా నవ్వాడు.. మిగతా సగం నేను మార్చేస్తా..

(సరదాకి మాత్రమే…)
-యర్రంశెట్టి సాయి