అక్కినేని థర్డ్ జెన్ లో ఇగో ప్రాబ్లమ్స్?

ఒక జనరేషన్ లోనే జనాల మధ్య అంతగా అభిమానాలు వుండని రోజులు ఇవి. అలాంటిది సెకెండ్ జనరేషన్ లోనూ, థర్డ్ జనరేషన్ లోనూ అవే అభిమానాలు, బంధాలు కొనసాగాలని లేదు. అది అంబానీ ఫ్యామిలీ…

ఒక జనరేషన్ లోనే జనాల మధ్య అంతగా అభిమానాలు వుండని రోజులు ఇవి. అలాంటిది సెకెండ్ జనరేషన్ లోనూ, థర్డ్ జనరేషన్ లోనూ అవే అభిమానాలు, బంధాలు కొనసాగాలని లేదు. అది అంబానీ ఫ్యామిలీ అయినా, మెగా ఫ్యామిలీ అయినా, అక్కినేని ఫ్యామిలీ అయినా తప్పదు. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. ఇన్నాళ్లు అక్కినేని ఫ్యామిలీ అంటే నాగ్, నాగ సుశీల, సుమంత్, సుప్రియ, సుశాంత్ ఇలా కుటుంబంగా వుంటూ వస్తున్నారు. అక్కినేని వెంకట్ పేరు ఎప్పుడో కానీ వినిపించదు. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీలో సుశాంత్ కొంచెం దూరం అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగు సినిమాలు చేసినా ఒక్కటీ హిట్ కాకపోవడం, నాగచైతన్య మెల్లగా హీరోగా స్టాండ్ కావడం, అఖిల్ కు కూడా ఇంతో అంతో క్రేజ్ వుండడంతో సుశాంత్ కాస్త ఫీల్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఆటాడుకుందాం రా సినిమా సమయంలో బయటపడినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో కజిన్ మీద అభిమానంతో అఖిల్, చైతూ జస్ట్ కామియో రోల్స్ చేసారు. నిర్మాత వాళ్ల క్రేజ్ ను వాడుకునే ప్రయత్నం చేసారు. ఆ మేరకు ఓ ఫోర్ షీట్ పోస్టర్ ఆ ఇధ్దరు మధ్యలో సుశాంత్ తో విడుదల చేసారు. ఆ సమయంలోనే సుశాంత్ సదరు నిర్మాతపై విరుచుకుపడినట్లు వినికిడి. నా సినిమాలో వాళ్లు చేసారా? వాళ్ల సినిమాలో నేను చేసానా? ఎలా వేస్తారు అలాంటి పోస్టర్ అని నిలదీసినట్లు తెలుస్తోంది. నిజానికి ఆ నిర్మాత వరుసగా సుశాంత్ తోనే నాలుగు సినిమాలు తీసారు.

దీంతో హర్ట్ అయిన ఆ నిర్మాత, తన తరువాత సినిమాను ఇంద్రగంటి డైరక్షన్ లో చైతన్యతో చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది గమనించి, ఆ నిర్మాతతో తమకు వున్న వేరే వ్యాపారాల లెక్కలు చెప్పమని, తప్పుడు లెక్కలు చెపితే ఊరుకోననీ సుశాంత్ గొడవ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ టస్సెల్ నే నడుస్తోంది. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ థర్డ్ జెన్ లో ఇగో సమస్యలు స్టార్ట్ అయ్యాయని అనుకోవాల్సివస్తోంది.