పగోడి సినిమా వస్తోందంటే పడగొట్టడానికి చూడ్డం అన్నది టాలీవుడ్ లో కామన్. అయితే అది హీరోలు చేయరు. హీరోల మనసెరిగిన టాలీవుడ్ జనాలు, అభిమానులు చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో కాటమరాయుడు వ్యవహారం ఇలాగే వుంది. కాటమరాయుడు సెన్సార్ రిపోర్ట్ అంటూ భయంకరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు టాలీవుడ్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటీవల బన్నీ క్యాంప్ కు, పవన్ క్యాంప్ కు మధ్య ఎంత మాత్రం పొసగడం లేదన్నది వాస్తవం. చెప్పను బ్రదర్ దగ్గర స్టార్ట్ అయిన తెరచాటు వివాదం అలా నడుస్తూనే వుంది. డైరక్టర్ త్రివిక్రమ్ ను ఖాళీగా అన్నా వుంచారు కానీ, బన్నీ దగ్గరకు రానివ్వలేదని టాక్ వుంది. ఆపై యూట్యూబ్ లో డిజె డిస్ లైక్ ల వ్యవహారం తెలిసిందే.
ఇప్పుడు బన్నీ క్యాంప్ టైమ్ వచ్చినట్లు తెలుస్తోంది. కాటమరాయుడు సెన్సార్ రిపోర్ట్ అంటూ ఇండస్ట్రీలో కొన్ని విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా డల్ అని, ఆ డల్ నెస్ వల్ల సెకండాఫ్ ఫరవాలేదనిపిస్తుంది తప్ప లేకుంటే అది కూడా అందులోనూ విషయం లేదని ఈ టాక్ సారాంశం. అయితే కొన్ని సర్కిళ్లలో కాటమరాయుడు ఏవరేజ్ అని, కొన్ని సర్కిళ్లలో డిజాస్టర్ అని కబుర్లు వినిపించి వ్యాపిస్తున్నాయి. అయితే ఇవన్నీ వాస్తవం కాదని, ఎవరో కావాలనే వీటిని స్ప్రెడ్ చేసి, సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం కనబర్చేలా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అదే విధంగా కాటమరాయుడు అడియోపై, పవన్ స్టయిలింగ్ పై నెగిటివ్ వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. ఇవన్నీ కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారని, ఈ సినిమా తో ఇది ఆగదని, ఆ తరువాత డిజె పై పవన్ ఫ్యాన్స్ స్టార్ట్ చేస్తారని, ఈ విధంగా ఇక పవన్-బన్నీ శిబిరాలు ఇలా ఎదురు ఎదురుగా నిల్చోవడం తప్పని సరి అయ్యేలా కనిపిస్తోందన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కధనం. అదే జరిగితే ఎన్నాళ్ల నుంచో ఇండస్ట్రీలో బలమైన క్యాంప్ గా వున్న మెగా క్యాంప్ రెండుగా చీలినట్లే.