ఈ మధ్య వందకోట్ల బడ్జెట్ అన్నది ఓ ఫిక్స్ డ్ ఫిగర్ గా మారిపోయింది. మరి ఇది క్రేజ్ అనుకోవాలో? ఫ్యాషన్ అనుకోవాలో? నిజంగా సిట్యువేషన్ డిమాండ్ చేస్తుందనుకోవాలో? మురుగదాస్-మహేష్ సినిమాతో ఇది స్టార్ట్ అయింది. ప్రభాస్-సుజీత్ సినిమా కూడా అంతే. కాస్త పది ఇరవై కోట్లు తక్కువైనా 80 దాకా బడ్జెట్ పెట్టుకున్నవి కూడా వున్నాయి.
ఇప్పుడు ఇంతకీ విషయం ఏమిటంటే, దర్శకుడు త్రివిక్రమ్ తను పవర్ స్టార్ తో చేయబోయే సినిమాకు 95 కోట్ల బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇచ్చారట. నిర్మాత చినబాబుకు ఈ మేరకు త్రివిక్రమ్ లెక్క చెప్పారట. దాంతో బాటే 120కోట్ల మేరకు బిజినెస్ లెక్కలు కూడా చెప్పి 20 నుంచి 25 కోట్ల టేబుల్ ప్రాఫిట్ కాగితాలపై చూపించేసినట్లు తెలుస్తోంది. అయితే ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 95కు ఓ అయిదు అవతలే కానీ, ఇవతల వుండదని క్లారిటీగా చెప్పేసారట.
అదీ నిజమే. త్రివిక్రమ్ సినిమా అంటే సీన్ లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కెమేరా ఏంగిల్ లో ఎక్కడో దూరంగా వుండే పనిమనిషి క్యారెక్టర్ కు కూడా రోజుకు 50 వేలు తీసుకునే ఆర్టిస్ట్ కావాలి. స్క్రీన్ అంత హెవీగా వుండకపొతే, ఆయనకు తన సినిమా ఆనదని ఇండస్ట్రీ టాక్ మరి. అందుకే ఆ మాత్రం ఖర్చవుతుంది.