ఆ నిర్మాత అలా చేసారా?

వాస్తవానికి ఆయన జర్నలిస్ట్. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి.  ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ నే ఆయనకు టాలీవుడ్ లోని ఓ పెద్ద ఫ్యామిలీతో పరిచయాలు అందించింది. దాంతో భారీగా లావాదేవీలు చేసారు. ఆయనకు…

వాస్తవానికి ఆయన జర్నలిస్ట్. తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారి.  ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ నే ఆయనకు టాలీవుడ్ లోని ఓ పెద్ద ఫ్యామిలీతో పరిచయాలు అందించింది. దాంతో భారీగా లావాదేవీలు చేసారు. ఆయనకు కూడా కాస్త భారీగానే భూములు వుండడం కలిసి వచ్చింది. నిర్మాతగా మారారు. వరుసగా ఒకే హీరోతో మూడు నాలుగు సినిమాలు చేసారు. ఏవీ కలిసిరాలేదు.

అంతవరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు సదరు నిర్మాతకు, ఆ ఫ్యామిలీకి చెడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ డీల్ లో భాగస్వాములుగా ఆ ఫ్యామిలీకి రావాల్సిన అమౌంట్ ఆ నిర్మాత దగ్గర చిక్కుకు పోయిందని, అది ఎలా రాబట్టాలా? అని కిందా మీదా అవుతున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్.

టాలీవుడ్ లో ఎలా వుంటుందంటే వ్యవహారం, బాగున్నంత కాలం అంతా బాగానే వుంటుంది. కానీ తేడావస్తేనే లోపల వ్యవహారాలు అన్నీ బయటకు రావడం ప్రారంభమవుతుంది. సదరు నిర్మాత గతంలో హిమాలయాల స్వామీజీ అని ఎవర్నో తెచ్చారని, ఆయనిచ్చే ఒక్క మోతాదు మందు వాడితే ఎంతో కాలం ఆరోగ్యంగా బతకొచ్చని చెప్పి, ఇండస్ట్రీ జనాలను కొంతమందిని ఆయన దగ్గరకు తీసుకెళ్లారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇలా వెళ్లిన వారిలో ఒకప్పుడు పెద్ద సినిమాలు తీసిన ఓ రాజకీయవేత్త కమ్ హోటలియర్ కూడా వున్నారని అంటున్నారు. మరి అలా మందు ఇచ్చినందుకు ఏమిచ్చుకున్నారో తెలియదు.

అలాగే ఆ కుటుంబానికి, ఈ నిర్మాతకు ఎందుకు? ఎక్కడ చెడిందో? ఎన్నికోట్ల మొత్తం తేడా వచ్చిందో? అన్నదానిపై వదంతులు అయితే చాలా వినిపిస్తున్నాయి. మరీ రచ్చ చేసుకోకుండా, వీలయినంత వరకు అక్రాస్ ది టేబుల్ సెటిల్ చేసుకోవాలని ఆ ఫ్యామిలీకి చెందిన పెద్ద హీరో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.