టాలీవుడ్ బ్యూటీ.. బాలీవుడ్ డ్రీమ్స్…

తెలుగులో 2 హిట్స్ తగిల్తే చాలు ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ కు చెక్కేద్దామని చూస్తుంది. ప్రతి ఒక్కరికీ బాలీవుడ్డే కావాలి. ఎందుకంటే పారితోషికం, పాపులారిటీ రెండూ పెరుగుతాయి. అందుకే హెబ్బా పటేల్ కూడా…

తెలుగులో 2 హిట్స్ తగిల్తే చాలు ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్ కు చెక్కేద్దామని చూస్తుంది. ప్రతి ఒక్కరికీ బాలీవుడ్డే కావాలి. ఎందుకంటే పారితోషికం, పాపులారిటీ రెండూ పెరుగుతాయి. అందుకే హెబ్బా పటేల్ కూడా ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తోంది. ఇలియాన, కాజల్, తమన్నలా తను కూడా హిందీ సినిమాల్లో నటించాలని అనుకుంటోంది.

నిజానికి టాలీవుడ్ లో హెబ్బాకు బ్లాక్ బస్టర్ మూవీస్ లేవు. కుర్రహీరోలతో ఓ మోస్తరు హిట్స్ మాత్రమే కొట్టింది. నటిగా ఆమె ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయి. ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకా మెరుగుపడాల్సి ఉంది. హెబ్బా మాత్రం ఇప్పటివరకు సంపాదించిన అనుభవం తనకు చాలంటోంది. కుదిరితే ఈ ఏడాదే బాలీవుడ్ లో అడుగుపెట్టాలని తహతహలాడుతోంది. ఈ మేరకు తనకు తెలిసిన బాలీవుడ్ సర్కిల్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోందట.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా త్వరలోనే బ్రేకింగ్ న్యూస్ చెబుతానంటూ ఊరించింది ఈ చిన్నది. ఆ బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ సినిమా అవకాశమే అయి ఉండొచ్చని టాక్. అయినా హిందీ చిత్రసీమకు వెళ్లిన ఇలియాన, తాప్సి లాంటి తారల కెరీర్ ఏమైందో అందరికీ తెలిసిందే. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి కూడా ఇంకా బాలీవుడ్ కలలుకంటున్న హెబ్బాను ఏమనాలి..