సుచి లీక్స్ – సుచిత్రకు గీతామాధురి మద్దతు

దక్షిణాదిని కుదిపేసిన సుచి లీక్స్ వ్యవహారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఎకౌంట్ నుంచి రోజుకో స్టార్ బాగోతం బయటపడిందనే వార్తలు టాలీవుడ్-కోలీవుడ్ ను ఊపేశాయి. ధనుష్, శింబు, అనిరుధ్, ఆండ్రియా,త్రిష, రానా,…

దక్షిణాదిని కుదిపేసిన సుచి లీక్స్ వ్యవహారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. సింగర్ సుచిత్ర ట్విట్టర్ ఎకౌంట్ నుంచి రోజుకో స్టార్ బాగోతం బయటపడిందనే వార్తలు టాలీవుడ్-కోలీవుడ్ ను ఊపేశాయి. ధనుష్, శింబు, అనిరుధ్, ఆండ్రియా,త్రిష, రానా, నయనతార, అమలాపాల్.. ఇలా చాలామంది తారల పేర్లు సుచి లీక్స్ సందర్భంగా వినిపించాయి. ఈ మొత్తం వ్యవహారంలో స్టార్స్ ఎవరూ స్పందించలేదు.

మరోవైపు సుచిత్రకు పిచ్చిపట్టిందని కొందరు, సైకోలా మారిందని మరికొందరు, ఆమెఎకౌంట్ హ్యాక్ అయిందని ఇంకొందరు చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. కానీ ఇన్నిరోజుల్లో ఆమెకు మద్దతిచ్చేవాళ్లు మాత్రం ఎవరూ కనిపించలేదు. ఎట్టకేలకు సుచిత్రకు మద్దతుగా గీతామాధురి మాట్లాడింది.

సుచిత్రకు పిచ్చిపట్టిందంటే తాను నమ్మనని అంటోంది గీతామాధురి. డిప్రెషన్ కు లోనయ్యేంత బలహీన మనస్తత్వం సుచిత్రది కాదని అంటున్న గీతామాధురి… విచారణలో నిజానిజాలు బయటపడతాయని అంటోంది. సుచిత్ర కేవలం సింగర్ మాత్రమే కాదని… రేడియోజాకీ, రచయితగా ఆమె చాలా టాలెంటెడ్ అని చెబుతున్న గీతామాధురి.. సుచిత్ర కచ్చితంగా మళ్లీ వెలుగులోకి వస్తుందని నమ్మకంగా చెబుతోంది.