బాలకృష్ణ-పూరి కాంబినేషన్ లో రాబోయే సినిమాల మీద గ్యాసిప్ లు చక్కర్లు కొడుతుంటే ఇండస్ట్రీలో మరిన్ని కబుర్లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ సినిమా జాన్ విక్ లైన్ ఆధారంగా దర్శకుడు పూరిజగన్నాధ్ ఈ సినిమాకు కథ తయారుచేసారని వదంతి వినిపిస్తోందన్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా, అది కూడా ఓ యాక్షన్ సినిమాకు సరిపడా ముడిసరుకు ఆ సినిమాలో వుంది. పైగా హీరో నేపథ్యంలో పేద్ద డాన్. అందువల్ల అది కూడా ప్లస్ నే.
అయితే తాజా ఖబర్ ఏమిటంటే, ఈ జాన్ విక్ అనే హాలీవుడ్ సినిమా డీవీడీ గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొట్టిందట. అసిస్టెంట్ డైరక్టర్లు, అప్ కమింగ్ డైరకర్లు, టాప్ డైరక్టర్లు అందరూ ఈ సినిమా తెగ చూసేసారట. కొంత మంది ఈ సినిమాలోంచి కొన్ని సీన్లు తమ సినిమాల్లోకి మార్చుకున్నట్లు వినికిడి. బాలయ్య సినిమాకు పూరి అందిస్తున్న కథ ఇదా కాదా ? అన్నది పక్కన పెడితే, జాన్ విక్ సినిమాలో సీన్లు రాబోయే కాలంలో చాలా సినిమాల్లో కనిపించే అవకాశం వుందని కామెంట్ లు వినిపిస్తున్నాయి.