బాలయ్య ప్రియ రాగాలు?

ఆటో జానీనా? జనగణమణ అని ఊహాగానాలు, గ్యాసిప్ లు వెల్లువెత్తుతున్నాయి బాలయ్య-పూరి సినిమా గురించి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా హాటెస్ట్ గా బయటకు వచ్చిన విషయం ఏమిటంటే, హాలీవుడ్ సినిమా లైన్ తీసుకుని…

ఆటో జానీనా? జనగణమణ అని ఊహాగానాలు, గ్యాసిప్ లు వెల్లువెత్తుతున్నాయి బాలయ్య-పూరి సినిమా గురించి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా హాటెస్ట్ గా బయటకు వచ్చిన విషయం ఏమిటంటే, హాలీవుడ్ సినిమా లైన్ తీసుకుని బాలయ్య సినిమా కు కథ రెడీ చేసారని. జాన్ విక్ అనే సినిమా స్పూర్తిగా బాలయ్య సినిమాకు పూరి కథ రెడీ చేసారని తెలుస్తోంది. ఈ జాన్ విక్ అనే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. పైగా కావాల్సినంత యాక్షన్ వుంటుంది. పైగా రిచ్ గా, కలర్ పుల్ వుండడానికి వీలయినంత స్కోప్ వుంటుంది. ఈ సినిమా అయితే దాదాపు ఎక్కువగా ఫారిన్ లోనే తీయాల్సి వుంటుంది.

జాన్ విక్ అనే సినిమాకు ఇటీవలే సీక్వెల్ కూడా వచ్చింది. అనారోగ్యంతో భార్య మరణిస్తే, ఆమె జ్ఞాపకంగా మిగిలిన ఓ కుక్క పిల్ల, తనకు ఎంతో ఇష్టమైన వింటేజ్ కారుతో బతుకుతుంటాడు ఓ మధ్యవయస్కుడు. ఆ కారును కావాలని అడిగి, ఇవ్వకపోవడంతో దొంగిలించేస్తాడో దుర్మార్గుడు. అది తెలిసి ఇతగాడు ఏం చేసాడు, ఏం జరిగింది అన్నది మిగిలిన లైన్.

చాలా ఆసక్తికరంగా, కమర్షియల్ పొటన్షియాలిటీ వున్న లైన్ నే. మరి దీన్నే పూరి తీసుకున్నారా? తన స్టయిల్ మార్పులు ఏమన్నా చేసారా అన్నది చూడాలి. అయితే ఇక్కడ ఓ విషయం గుర్తుకు వస్తుంది. చాన్నాళ్ల క్రితం జగపతిబాబు ఓ సినిమా చేసారు. సౌందర్య హీరోయిన్. ఆమె సినిమా ప్రారంభంలోనే చనిపొతుంది. ఆమె సమాధి వున్న మాంచి హిల్ స్టేషన్ లోని ప్లేస్ కోసం విలన్ అమ్మమని పట్టుపడుతుంటాడు. మరో పక్క సెకెండ్ హీరోయిన్ మహేశ్వరి వుంటుంది. విలన్ ను చేసే పనులను హీరో ఎలా ఎదుర్కోన్నాడన్నది ఆ లైన్. క్లాస్ సినిమా గా తీసారు అప్పట్లో, దానికే మాస్ వెర్షన్ లా వుంటుంది ఈ హాలీవుడ్ సినిమా.

చూడాలి పూరి ఏం చేయబోతున్నారో?