శంకర్ దర్శకత్వంలో 2.0 సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం భారీ స్థాయిలో ఖర్చుచేస్తున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం… 2.0 కోసం దాదాపు 400కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇండియన్ మూవీ హిస్టరీలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను ఇప్పుడు ఆస్కార్ నామినేషన్లకు పంపించే ఆలోచనలో కూడా ఉన్నారట.
సాధారణంగా మూవీ విడుదలైన తర్వాత వచ్చే రెస్పాన్స్, మూవీలో స్టఫ్ ఆధారంగా ఆస్కార్ కు నామినేట్ చేయాలా వద్దా అనే విషయాన్ని ప్రత్యేకంగా ఓ కమిటీ నిర్ణయిస్తుంది. అయితే 2.0 సినిమా విషయంలో మాత్రం కాస్త ముందుగానే ఆర్భాటం మొదలైంది. కమిటీతో సంబంధం లేకుండానే సినిమాను ఆస్కార్ కు పంపిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఏదో ఒక విభాగంలో 2.0కు ఆస్కార్ గ్యారెంటీ అంటూ కొత్త ప్రచారం ఎత్తుకున్నారు మేకర్స్.
ఆస్కార్ అవార్డ్స్ లో చాలా విభాగాలుంటాయి. అయితే ఇండియన్ మూవీస్ ఎక్కువగా ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అవుతుంటాయి. ఈ విభాగంలో రజనీకాంత్ సినిమాకు ఈసారి ఆస్కార్ వచ్చేస్తుందని అంటున్నారు కొందరు వీరాభిమానులు. ఒకవేళ ఈ సెగ్మెంట్ లో రాకపోయినా, మ్యూజిక్ డైరక్టర్ రెహ్మాన్ కైనా ఈ సినిమాతో మరో ఆస్కార్ దక్కుతుందని గొప్పలు చెబుతున్నారు. మొత్తానికి 2.0 సినిమాకు ఆస్కార్ రేంజ్ లో ప్రచారం దక్కుతోందన్నమాట. రజనీకాంతా మజాకా…