'నేను ఉన్నాను.. నేను విన్నాను..' అంటూ సర్కారువారి పాట సినిమాలో మహేశ్ చేత ఈ సినిమా రచయిత, దర్శకుడు చెప్పించిన డైలాగ్ తో సదరు సినిమా అటాక్ కు గురి అవుతూ ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రేడ్ మార్క్ డైలాగ్ అయిన ఈ మాటను మహేశ్ సినిమాలో హీరోయిన్ కు హీరో భరోసా ఇచ్చే సీన్లో వాడినట్టుగా ఉన్నారు. ట్రైలర్ తోనే ఈ క్లారిటీ వచ్చింది. అప్పుడే పచ్చబ్యాచ్ కు ఈ సినిమా ఒక రకంగా లక్ష్యంగా మారింది.
సినిమా ఎలా ఉన్నా.. దీనిపై నెగిటివ్ ప్రచారానికి వారు అప్పుడే రెడీ అయిపోయారు. సినిమా విడుదలతో ఆ అటాక్ ను తీవ్రతరం చేస్తూ ఉన్నారు. తమకు నచ్చని వారికి సంబంధించి ఏ చిన్న విషయాన్నీ పచ్చ బ్యాచ్ వదిలే రకం కాదు. దీనికి మహేశ్ సినిమా కూడా అతీతం కాకుండా పోయింది.
ఒకవేళ ఆ డైలాగ్ పెట్టకపోయి ఉంటే.. మహేశ్ సినిమాలో కమ్మదనం వారికి రుచించేదేమో. సందర్భోచితంగా ఆ డైలాగ్ ను వాడినప్పటికీ పచ్చ బ్యాచ్ మాత్రం ఈ సినిమా ను వదిలేట్టుగా లేరు. ఇదేదో సోషల్ మీడియాలో జరిగే దాడే కాదు. డైరెక్టుగా పచ్చమీడియానే రంగంలోకి దిగిపోయింది. ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని సదరు మీడియా వర్గాలు హైలెట్ చేస్తూ ఉన్నాయి.
తమకు వ్యతిరేకులకు సంబంధించి ఏ అంశాన్నీ వదిలేది లేదని, మీద పడి రక్కేయడమే అని పచ్చబ్యాచ్ ఈ సందర్భంగా మరోసారి క్లారిటీ ఇస్తోంది సర్కారువారి పాట సినిమాపై తీవ్రమైన దాడి ద్వారా!