ఇంట్రెస్టింగ్ లైనప్ సిద్ధం చేసిన హీరో

సినిమాలు చేయడం ఒకెత్తు, వరుసగా మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో హీరో కార్తి, చాలా ప్లాన్డ్ గా ఉంటాడు. ప్రస్తుతం జపాన్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన…

సినిమాలు చేయడం ఒకెత్తు, వరుసగా మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లో హీరో కార్తి, చాలా ప్లాన్డ్ గా ఉంటాడు. ప్రస్తుతం జపాన్ సినిమాను విడుదలకు సిద్ధం చేసిన ఈ హీరో.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని ఎనౌన్స్ చేశాడు. వేటికవే విభిన్నంగా, ఆసక్తికరంగా ఉన్నాయి.

జపాన్ సినిమాను కొలిక్కి తెచ్చిన కార్తి, సూదుకవ్వం దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. పదేళ్ల కిందటొచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. డార్క్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమాతో నలన్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత మాయావన్, సూపర్ డీలక్స్ లాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించాడు. ఇప్పుడు కార్తీతో మరో డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు మరో 3 సినిమాలు ఎనౌన్స్ చేశాడు కార్తి. వీటిలో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. తన కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన ఖైదీ, సర్దార్ సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించాడు. ఈ రెండింటికీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ తీసే అర్హత ఉందంటున్నాడు.

ఇక కార్తి ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా కూడా ఉంది. 96 (తెలుగులో జాను) దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదొక హార్ట్ టచింగ్ ఫ్యామిలీ-లవ్ డ్రామా అని చెబుతున్నాడు.

ఇలా కార్తి చేయబోయే సినిమాలన్నీ వేటికవే భిన్నంగా ఉంటూ, ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో కనీసం 3 సినిమాల్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వెల్లడించాడు ఈ హీరో.