పాపం..క్రిష్ అండ్ కో

కొందరి జాతకాలు అంతే..సరస్వతీ కటాక్షం వుంటుంది కానీ లక్ష్మీ కటాక్షం అంతగా వుండదు. దర్శకుడు క్రిష్ అండ్ కో వ్యవహారం ఇలాంటిదే. వారి సినిమాలన్నీ ఓన్ బ్యానర్ పైనే. అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టిన…

కొందరి జాతకాలు అంతే..సరస్వతీ కటాక్షం వుంటుంది కానీ లక్ష్మీ కటాక్షం అంతగా వుండదు. దర్శకుడు క్రిష్ అండ్ కో వ్యవహారం ఇలాంటిదే. వారి సినిమాలన్నీ ఓన్ బ్యానర్ పైనే. అన్నీ మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలే. అయితే కుప్పలు తెప్పలుగా లాభాలు తెచ్చిన సినిమాలు మాత్రం కావు. మరీ చేతులు కాల్చలేదంతే. కృష్ణం వందే జగద్గురుం లాంటి భారీ సినిమా కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది.

అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో బాలయ్య వందో సినిమా నిర్మించే అవకాశం వచ్చింది. దాంతో క్రిష్ అండ్ కో రొట్టె విరిగి నేతిలో పడిందనుకున్నారంతా. పైగా సబ్జెక్ట్ కూడా అలాంటిది కుదిరింది. సింపుల్ గా 51 కోట్ల బడ్జెట్ లో పూర్తి చేసి 65 కోట్ల మేరకు అమ్మకాలు సాగించేసారు. ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చాయి క్రిష్ అండ్ కో కు అనుకున్నారు అంతా.

కానీ మళ్లీ కథ అడ్డం తిరిగేసింది. ఇన్ కమ్ టాక్స్ రూపంలో విధి వెక్కిరించింది. 80 కోట్లకు లెక్కలు చెప్పాలంటూ ఇన్ కమ్ టాక్స్ అధికారులు కిందా మీదా పెడుతున్నారని వినికిడి. అంతే కాదు చాలా రికార్డులు పట్టుకెళ్లడం, కొన్ని బ్యాంక్ అక్కౌంట్లు సీజ్ చేయడం కూడా జరిగిందని తెలుస్తోంది.

దీంతో ఓ మంచి సినిమా, అది కూడా కాస్త లాభం మిగిల్చిన సినిమా అందించాలన్న ఆనందం ఆవిరైపోయింది క్రిష్ అండ్ కో కు. ఇప్పుడు ఈ ఇన్ కమ్ టాక్స్ సమస్య నుంచి బయటపడడానికి కిందా మీదా అవుతున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.