వరుస హిట్ లతో, పట్టిందల్లా బంగారం అన్నట్లు నడుస్తోంది నిర్మాత, పంపిణీ దారుడు దిల్ రాజు టైమ్. ప్రతి సినిమాలోనూ అడ్డ సుడి లాభాలు వచ్చేసాయి ఇటీవల. అలాంటిది పాపం, ఒక్కసారిగా ఎనిమిది కోట్లు ఖాతాకు డెబిట్ అయిపోయింది. తిరుపతి వెంకన్న అంటే విపరీతమైన భక్తి దిల్ రాజుకు.
తన ఊళ్లో మాంచి భారీ ఆలయం కూడా నిర్మించారు. ఆ భక్తితోనే ఓం నమో వెంకటేశాయ సినిమాను 8 కోట్ల మేరకు పెట్టి నైజాం హక్కులు తీసుకున్నాడు. అది కూడా మినిమమ్ గ్యారంటీ కి కాదు. నాన్ రిఫండబుల్ కింద. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఆ సినిమా కాస్తా బాక్సాఫీసు దగ్గర కుదేలయంది. దీంతో దిల్ రాజు ఆ సినిమాపై పెట్టిన 8 కోట్లూ హుష్ కాకే అని వినికిడి.
శతమానంలో, నేను లోకల్ లో, ఇంకా ఒకటి రెండు సినిమాల పంపిణీల్లో భయంకరంగా లాభాలు వచ్చాయి. కానీ ఈ కన్నం కూడా అంతే రేంజ్ లో వున్నట్లుంది చూస్తుంటే. అయినా ఫరవాలేదు బన్నీ డిజె వుందిగా అంతకు అంతా కవర్ చేసేస్తుందేమో?