ఆ సినిమా ఏమైంది సుకుమార్‌జీ?

హీరోగా తన టాలెంట్‌ చూపించాలని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి ఎప్పట్నుంచో కోరిక వుంది. అందుకే మిగతా సంగీత దర్శకుల్లా కాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై కేర్‌ తీసుకుంటూ వుంటాడు. దాదాపు పదేళ్ల నుంచి దేవిని హీరో…

హీరోగా తన టాలెంట్‌ చూపించాలని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కి ఎప్పట్నుంచో కోరిక వుంది. అందుకే మిగతా సంగీత దర్శకుల్లా కాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై కేర్‌ తీసుకుంటూ వుంటాడు. దాదాపు పదేళ్ల నుంచి దేవిని హీరో చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

దేవితో అశ్వనీదత్‌ ఒక సినిమా అనౌన్స్‌ చేసినా అది పట్టాలెక్కలేదు. రీసెంట్‌గా దేవిని హీరోని చేసే బాధ్యత తనదే అంటూ సుకుమార్‌ అనౌన్స్‌ చేసాడు. దేవి హీరోగా త్వరలోనే సినిమా తీయబోతున్నానంటూ ప్రకటించాడు. కానీ అది ప్రస్తుతానికి ప్రకటనకే పరిమితమైంది.

చరణ్‌తో సినిమా మొదలు పెట్టిన సుకుమార్‌ ఇంకా తన తదుపరి చిత్రంపై డిసైడ్‌ అవలేదు. దర్శకుడిగా తన సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన దేవిశ్రీప్రసాద్‌కి హీరో అవ్వాలనే ముచ్చటని సుకుమార్‌ తీర్చేదుందా? హీరో కాకపోయినప్పటికీ చాలా సినిమాల విజయాలకి వెన్నెముకగా నిలుస్తూ దేవి ఎలాగో హీరో అనిపించేసుకుంటున్నాడనుకోండి.