క‌మ‌ల్ .. ఈ వ‌య‌సులోనూ ఏం పాడాడు!

కేవ‌లం న‌టుడిగానే కాకుండా ద‌శాబ్దాల నుంచి గాయ‌కుడిగా కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ ఉన్నాడు క‌మ‌ల్ హాస‌న్. తెలుగులో కూడా క‌మ‌ల్ ప‌లు పాటల‌ను పాడారు. త‌ను డ‌బ్బింగ్ చెప్పుకోని సినిమాల్లో కూడా క‌మ‌ల్…

కేవ‌లం న‌టుడిగానే కాకుండా ద‌శాబ్దాల నుంచి గాయ‌కుడిగా కూడా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ ఉన్నాడు క‌మ‌ల్ హాస‌న్. తెలుగులో కూడా క‌మ‌ల్ ప‌లు పాటల‌ను పాడారు. త‌ను డ‌బ్బింగ్ చెప్పుకోని సినిమాల్లో కూడా క‌మ‌ల్ పాట‌లు మాత్రం పాడాడు. అలాంటి పాట‌లు కొన్ని ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

ఇక తెలుగు వెర్ష‌న్ ఎస్పీబీ పాడ‌గా, త‌మిళంలో క‌మ‌ల్ బోలెడ‌న్ని పాట‌లు పాడాడు. ఇలా సింగ‌ర్ గా కూడా క‌మ‌ల్ త‌న ప్ర‌త్యేక‌త చాటుకోగా.. ఇప్పుడు మ‌రో యూట్యూబ్ లో క‌మ‌ల్ పాట ఇంకోటి ట్రెండ్ అవుతోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హీరోగా రూపొందుతున్న విక్ర‌మ్ సినిమా కు సంబంధించి త‌మిళ పాట విడుద‌ల అయ్యింది. 

ఈ పాట‌కు సంబంధించి కొన్ని విజువ‌ల్స్ ను, లిరిక‌ల్ ఆడియోను యూట్యూబ్ లో విడుద‌ల చేశారు. 67 యేళ్ల వ‌య‌సులో క‌మ‌ల్ ఈ పాట‌లో ఎన‌ర్జిటిక్ గా డ్యాన్సు చేయ‌డ‌మే కాదు, క‌మ‌ల్ గాత్రంలో కూడా ఎలాంటి త‌డ‌బాటు లేదు.  

చాలా మంది ప్ర‌ముఖ గాయ‌నీ గాయ‌కులు కూడా ఈ వ‌య‌సుకు వ‌చ్చాకా పాడ‌టం అంత తేలిక కాదు. అందులోనూ ఒక ఫాస్ట్ బీట్, మాస్ సాంగ్ త‌రహా పాట‌ను ఈ వ‌య‌సులో ఈ న‌టుడు ఉత్సాహ‌వంతంగా ఆల‌పించ‌డం గ‌మ‌నార్హం.

అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సాంగ్ త‌మిళ వెర్ష‌న్ ఉత్సాహంగా ఉంది. మ‌రి తెలుగు వెర్ష‌న్ సంగ‌తేంటో!