మహేష్ హీరోగా నటించిన సర్కారువారి పాట రికార్డుల వేట మొదలైంది. ఓవర్సీస్ లో ఈ సినిమా తొలి రికార్డ్ నమోదు చేసింది. అమెరికాలో ప్రీమియర్ షోజ్ నుంచి ఈ సినిమాకు ఏకంగా 9 లక్షల 25వేల డాలర్లు వచ్చాయి.
ఇండియన్ సినిమాల్లో ఈ ఏడాది ప్రీమియర్స్ ద్వారా అత్యథిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా సర్కారువారి పాట రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాతో ఓవర్సీస్ లో మహేష్ బాబు స్టామినా ఏంటనేది మరోసారి ప్రూవ్ అయింది.
ప్రస్తుతం ఓవర్సీస్ ప్రీమియర్స్ రికార్డ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఉంది. ఆ సినిమా పలు భాషల్లో విడుదలైంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా ఈ సినిమా ప్రీమియర్ వసూళ్లను మొదటి రోజు కలెక్షన్లు (5.5 మిలియన్ డాలర్లు)తో కలిపి చెప్పారు. అదే సర్కారువారి పాట విషయానికొస్తే.. మహేష్ నటించిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే విడుదలైంది.
యూఎస్ లో తెలుగు వెర్షన్ ను 477 లొకేషన్లలో ప్రదర్శిస్తే.. కేవలం ప్రీమియర్స్ ద్వారా 9 లక్షల 25వేల డాలర్లు రావడం చాలా పెద్ద విషయం. మరికొన్ని లొకేషన్ల నుంచి ఇంకా డేటా రావాల్సి ఉంది. అవి కూడా కలిపితే ప్రీమియర్స్ గ్రాస్ ఎమౌంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మహేష్ కెరీర్ లో ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటివరకు స్పైడర్ మూవీ ఉండేది. ఇప్పుడా స్థానాన్ని సర్కారువారి పాట ఆక్రమించింది. కరోనా తర్వాత ఆర్ఆర్ఆర్ మినహా మరే చిత్రం ప్రీమియర్స్ ద్వారా మిలియన్ మార్క్ అందుకోలేకపోయింది. సర్కారువారి పాట సినిమా ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
ఈ ఏడాది ప్రీమియర్స్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సినిమాలు (ఆర్ఆర్ఆర్ కాకుండా)
సర్కారువారి పాట – $925K, భీమ్లానాయక్ – $870K, రాధేశ్యామ్ – $900K, ఆచార్య – $650K