జగన్ 2.O: సంక్షేమమే కాదు.. అభివృద్ధి కూడా..!

నిన్నమొన్నటి వరకూ వైసీపీ నాయకులకు జనానికి చెప్పుకోడానికి సంక్షేమ పథకాలే కనిపించేవి. మీ కుటుంబానికి ఫలానా పథకాలు వర్తిస్తున్నాయి.. ఇంత అమౌంట్ వస్తుందని లెక్కలు చెప్పేవారు. కానీ జగన్ తన రూలింగ్ కు సంబంధించి…

నిన్నమొన్నటి వరకూ వైసీపీ నాయకులకు జనానికి చెప్పుకోడానికి సంక్షేమ పథకాలే కనిపించేవి. మీ కుటుంబానికి ఫలానా పథకాలు వర్తిస్తున్నాయి.. ఇంత అమౌంట్ వస్తుందని లెక్కలు చెప్పేవారు. కానీ జగన్ తన రూలింగ్ కు సంబంధించి సెకండాఫ్ లో మిగతా వాటిపై ఫోకస్ పెట్టారు. 

ఇలా జరుగుతుందని గ్రేట్ ఆంధ్ర ఇదివరకే చెప్పింది. ఇప్పుడది అమలులోకి వచ్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పరిస్థితి మారిపోయింది. మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టారు జగన్. ఇప్పుడు ప్రాజెక్ట్ ల రూపకల్పనకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నెల్లూరులో త్వరలో బయో ఇథనాల్ ప్రాజెక్ట్ మొదలు కాబోతోంది. దీంతోపాటు.. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో కాస్టిక్ సోడా ప్లాంట్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆ ప్లాంట్ వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పుడు క్రిభ్కో ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రూ.560కోట్లతో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 

స్థానిక యువతకు ఈ ఇథనాల్ ప్లాంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 100 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

విత్తన శుద్ధి, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు, ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022-27 రూపకల్పనకు కూడా ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం నిర్ణయం తీసుకుంది.

మొత్తమ్మీద జగన్ ఇప్పుడు సంక్షేమంతో పాటు.. అభివృద్ధి, మౌళిక వసతులు, ఉపాధి కల్పన కార్యక్రమాలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. గడప గడపకు కార్యక్రమంలో అసలు జనాలు ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారనే విషయంపై ఓ క్లారిటీకి రాబోతున్నారు జగన్. ఆ రిపోర్టులన్నీ వచ్చిన తర్వాత మరోసారి లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టి కొత్త కార్యాచరణ మొదలు పెట్టడానికి రెడీ అవుతారు.

ఈలోగా.. ఉపాధి కల్పనపై జగన్ దృష్టిపెట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రారంభోత్సవాలు, కొత్త కంపెనీల నిర్మాణాలతో ఏపీలో నవశకం మొదలురాబోతోంది. అప్పుడిక ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కోణం కూడా కూడా మిగలదు.