ఆమె తెలుగుదేశం ఏర్పాటు అవుతూనే అందులో చేరారు. కెరీర్ సుదీర్ఘంగా కొనసాగించారు. ఆమె ఎవరో కాదు కావలి ప్రతిభా భారతి. ఎన్నో ఎన్నికల్లో గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన ప్రతిభా భారతిని చంద్రబాబు 1999 ఎన్నికల తరువాత స్పీకర్ ని చేశారు.
ఆ తరువాత ఆమెకు రాజకీయాలు అంతగా కలసిరాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూడా ఓటమి ఎదురైంది. దాంతో తన వారసురాలు గ్రీష్మకు టికెట్ ఇవ్వాలని ఆమె కోరుతూ వచ్చారు. ఇక చూస్తే రేపటి ఎన్నికల్లో టికెట్ సంగతి ఏమో కానీ పార్టీలో మాత్రం గ్రీష్మకు గుర్తింపు లభించింది.
ఆమెను పార్టీ అధినాయకులు రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. దాంతో ఇక మీదట ఆ పార్టీ స్పీకర్ గా ఉంటారన్న మాట. ఇక రాజాం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే అక్కడ మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ రావు ఉన్నారు.
మరి ఆయన్ని కాదని టికెట్ ఇస్తారా లేక పార్టీ కోసం ఆమె సేవలను ఉపయోగించుకుంటారా అన్నది చూడాలి. ఎట్టకేలకు మాజీ స్పీకర్ వారసురాలికి పార్టీలో గుర్తింపు లభించింది అని కావలి ఫ్యామిలీ తో పాటు అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.