మహేష్ బాబు తన తాజా సినిమా షూట్ నుంచి కాస్త గ్యాప్ తీసుకుంటున్నారు. ఓ వారం పది రోజులు మలేషియా వెళ్లబోతున్నారు. ఏటా రెండు సార్లు వెళ్లే ఫ్యామిలీ వేకేషన్ ట్రిప్ కోసం కాదు. ఈ ట్రిప్ తన హెల్త్ కండిషన్ కోసమట.
మహేష్ కు ఓ అలవాటు వుందట. ఏటా రెండు సార్లు శరీరానికి డీ టాక్సినేషన్ చేయించుకుంటారట. అంటే బాడీలో వున్న మలినాలు అన్నింటినీ తొలగించుకోవడం అన్నమాట. కొన్ని మెడిసిన్స్, కొంత ఎక్స్ ర్ సైజ్,కొంత మసాజ్ ఇలాంటి వాటి ద్వారా చెమటల ద్వారా బాడీలోని మలినాలను బయటకు పోయేలా చేయడాన్నే ఈ డీ టాక్సినేషన్ అంటారు. ఇంతకు ముందు డెహ్రాడూన్ దగ్గర ఈ ట్రీట్ మెంట్ తీసుకున్నాడట మహేష్.
ఇప్పుడు మలేషియాలో చేయించుకోబోతున్నాడట. దీంతో పాటే తన బరువులో ఓ రెండు కిలోలు తగ్గే పని కూడా ఈసారి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హెల్త్ విషయంలో అంత కేర్ తీసుకుంటాడు కాబట్టే, మహేష్ అంటే గ్లామర్..గ్లామర్ అంటే మహేష్ అన్నట్లు వుంటున్నాడు.