ఎన్టీఆర్ కు హీరోయిన్ కావలెను

ఎన్టీఆర్- బాబి సినిమా ముహుర్తం పది రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఇప్పటికి ఒక్క హీరోయిన్ నే ఫైనల్ అయింది. కేవలం రాశీఖన్నా మాత్రమే ఫిక్స్  అయింది. సమంత, నివేధాథామస్ అనుకున్నారు కానీ ఇద్దరికీ డేట్ల…

ఎన్టీఆర్- బాబి సినిమా ముహుర్తం పది రోజుల్లోకి వచ్చేసింది. కానీ ఇప్పటికి ఒక్క హీరోయిన్ నే ఫైనల్ అయింది. కేవలం రాశీఖన్నా మాత్రమే ఫిక్స్  అయింది. సమంత, నివేధాథామస్ అనుకున్నారు కానీ ఇద్దరికీ డేట్ల సమస్యే. సమంతకు ఫ్యామిలీ ఫంక్షన్లు అడ్డం పడ్డాయి. నివేదాకు డేట్లు లేవు. ఎలాగైనా డేట్లు అడ్జస్ట్ చేయమంటున్నారు.

కానీ ఆమెకు పాజిబుల్ కావడం లేదని వినికిడి. మూడో హీరోయిన్ తో సమస్య లేదు. ఎక్కువ డేట్లు అక్కరలేదు కాబట్టి. కానీ రాశీఖన్నా డేట్లు, దొరికాల్సిన రెండో హీరోయిన్ డేట్లు మ్యాచ్ కావాలి. అదే సమస్య. అందుకే 10లోగా హీరోయిన్ దొరికితే సరే లేదూ అంటే, ఆ సీన్లు పక్కన పెట్టి, ముందుకు వెళ్లిపోయాలని ఎన్టీఆర్, బాబీ డిసైడ్ అయిపోయారు.

అయితే అప్పటిదాకా ఆగలేని జనాలు మాత్రం నివేదా పక్కా అంటూ వార్తలు ప్రకటించేసారు. అది చూసి నివేదా షాక్ అవుతోందట. ఏమిటో…టాలీవుడ్ కు సరైన హీరోయిన్లు దొరకడం లేదు. కొత్తగా ఆలోచించే డైరక్టర్లు కరువు అవుతున్నారు.