అసలే మాంచి సంగీత్ కార్యక్రమం. దానికి తగిన భారీ అలంకరణతో కూడిన సెట్. అందమైన మోడల్స్ బోలెడు మంది వచ్చారు. వచ్చిన వారు ఊరుకున్నారా? భంగిమలు, సోలో,గ్రూప్ సెల్ఫీలు. అది కూడా ఈ కార్నర్ లో, ఆ కార్నర్ లో. దీంతో హీరో అల్లు అర్జున్ కు చిర్రెత్తుకు వచ్చింది. ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని, అసలు ఆ సంగీత్ సెట్ లో ఫోటోలే వద్దని వార్నింగ్ ఇచ్చేసాడట.
ఏమిటిదంతా? అంటే..డిజె అనే దువ్వాడ జగన్నాధమ్ సంగతి. దువ్వాడ జగన్నాధమ్ సినిమా కోసం ఇటీవల ఓ సంగీత్ సీన్ లాంటిది ఒకటి షూట్ చేసారట. అందుకోసం ఓ మాంచి సెట్ రెడీ చేసారట. ఈ సీన్ కోసం కొంతమంది మోడల్స్ ను తీసుకువచ్చారట. వారంతా సంగీత్ హడావుడి, డెకరేషన్ చూసి,షూట్ గ్యాప్ లో సెల్ఫీలు, గ్రూప్ స్టిల్స్ తీసుకోవడం మొదలు పెట్టారట.
ఇది తెలిసి, బన్నీ నిర్మొహమాటంగా చెప్పేసాడట. షూటింగ్ ప్లేస్ కానీ, షూట్ వివరాలు కానీ తెలిసిపోయేలా స్టిల్స్ ఏవీ బయటకు వెళ్లడానికి వీల్లేదని, సెల్పీలు కావాలంటే బయట తీసుకోవాలని ఆదేశించడట. దువ్వాడ జగన్నాధమ్ సినిమా గురించి బన్నీ కాస్త గట్టి కేర్ నే తీసుకుంటున్నట్లుంది. గీతా సంస్థ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.