విశ్వక్ సేన్ విడుదల చేసిన ‘పేక మేడలు’ టీజర్

‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ రాకేశ్‌ వర్రే నిర్మించిన…

‘నా పేరు శివ’, ‘అందగారం’ చిత్రాల ఫేం వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తూ రాకేశ్‌ వర్రే నిర్మించిన ‘పేక మేడలు’ చిత్రం టీజర్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్‌ మాట్లాడుతూ ‘‘రాకేశ్‌ య్టాకర్‌గా నటిస్తూనే నిర్మాతగా కూడా మారడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం హీరో వినోద్‌ కళ్లతో నటిస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్‌ అద్భుతంగా ఉంది. మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా అన్నారు.

నిర్మాత రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ ‘‘ హీరోగా నేను చేసిన ఎవరికి చెప్పొద్దు’ వచ్చిన మూడేళ్లకు నిర్మాతగా ఈ సినిమా చేశా. నా మొదటి సినిమాకు ఎవరైతే సాయం చేస్తాననుకున్నానో వారు చేయలేదు. అప్‌కమింగ్‌ డైరెక్టర్స్‌ శశికిరణ్‌ తిక్కా, రాహుల్‌ సంక్రిత్యన్‌, తరుణ్‌ భాస్కర్‌లతోపాటు సుకుమార్‌, కొరటాల శివ వంటి దర్శకులు సపోర్ట్‌తో ఆ సినిమా విడుదల చేయగలిగా. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా 30 రోజులు ఆడింది. ఇప్పుడు అదే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్‌ సినిమాలో ఒకటిగా నిలిచింది. తర్వాత నేనేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ‘స్నేహితుడి ద్వారా ‘పేక మేడలు’ కథ వచ్చింది. నచ్చి నేను హీరోగా కాకుండా నిర్మాతగా ఈ సినిమా మొదలుపెట్టా. హైదరాబాద్‌లోని ఓ బస్తీలో సాగే కథ ఇది. ఈ చిత్రానికి వినోద్‌, అనూష యాప్ట్‌. వాళ్లిద్దరిమీదే సినిమా నడుస్తుంది అన్నారు.

దర్శకుడు నీలగిరి మాట్లాడుతూ ‘‘చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశా. అనీస్‌ కురువిళ్లా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. అప్పుడే ఈ కథ నా మనసులో మెదిలింది. బస్తీ లైఫ్‌ ఎలా ఉంటుంది. అక్కడ ఎవరు పేక మేడలు కడతారు అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం చేశాం. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదురయ్యే కథ ఇది. ఇలాంటి కథ బయటకు వెళ్తే బజ్‌ క్రియేట్‌ అవుతుందని నమ్మి చేశాం అన్నారు.

వినోద్‌ మాట్లాడుతూ ‘‘పేక మేడలు’ చిత్రంలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. సెకెండ్‌ లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన ఆఫర్‌ ఇది. ఈ సిననిమా జర్నీ బ్యూటిఫుల్‌గా సాగింది. తెలుగు సినిమాలో నాన్‌ తెలుగు హీరోని తీసుకోవడం అంటే ఎంతో నమ్మకం ఉండాలి’’ అని అన్నారు.  హీరోయిన్‌ అనుష సినిమాలో అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసి సినిమా సక్సెస్‌ కావాలని అభిలాషించారు.