అంతా త్రివిక్రమ్ నే చేసారు!

అవును… బ్రో సినిమా తెర వెనుక కర్త..కర్మ..క్రియ త్రివిక్రమ్ నే. పలు ఇంటర్వూల్లో దర్శకుడు సముద్రఖని ఏం చెప్పారో ఓసారి గుర్తు చేసుకుందాం Advertisement ‘తమిళ సినిమా గురించి అడిగితే త్రివిక్రమ్ గారికి చెప్పాను.…

అవును… బ్రో సినిమా తెర వెనుక కర్త..కర్మ..క్రియ త్రివిక్రమ్ నే. పలు ఇంటర్వూల్లో దర్శకుడు సముద్రఖని ఏం చెప్పారో ఓసారి గుర్తు చేసుకుందాం

‘తమిళ సినిమా గురించి అడిగితే త్రివిక్రమ్ గారికి చెప్పాను. ఆయన కొద్ది సేపట్లోనే ఇలా మారిస్తే ఎలా వుంటుంది అంటూ ఓ మాంచి కమర్షియల్ టచ్ ఇచ్చి కథ చెప్పేసారు. అంత ఫాస్ట్ గా కథ చెప్పడం సూపర్…

ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో చేస్తారా అని అడిగారు..అంతకన్నా ఏం కావాలి అనే టైప్ ఆన్సర్ ఇచ్చా..

వెంటనే పవన్ కు ఫోన్ చేసి లైన్ చెప్పారు..ఆయన ఓకె అన్నారు..టైమ్ కలిసి రావడం అంటే ఇదే..’

ఇంచుమించు ఇవే అర్ధం వచ్చేలా ఒకటికి పదిసార్లు చెప్పారు సముద్రఖని.

బ్రో సినిమాలో కాలపురుషుడు చిటికె వేస్తే చాలు అంతా జరిగిపోతుంది. త్రివిక్రమ్ కూడా అంతే చిటికె వేసినట్లే సినిమా సెట్ చేసేసారు.

పవన్ లాంటి పెద్ద హీరో సినిమా అంటే ఇంత ఆషామాషీనా?

రెండు వందల కోట్ల మార్కెట్ వున్న హీరో సినిమాను ఇలాగే క్షణాల్లో సెట్ చేసేస్తారా?

మంచి చెడ్డలు ఆలోచించరా? పవన్ క్రేజ్, ఫ్యానిజం, మార్కెట్ ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదా?

మరి పవన్ దగ్గర చిటికెలో పని చేయించుకోగలిగిన త్రివిక్రమ్ చిటికెలు మహేష్ బాబు దగ్గర ఎందుకు చప్పుడు చేయడం లేదు. కథ మీద ఎందుకు అంత సుదీర్ఘమైన కసరత్తు చేయాల్సి వచ్చింది?

సరే ఆ సంగతి అలా వుంచుందాం. మళ్లీ బ్రో సంగతికి వస్తే… మాటలు రాసే బాధ్యత బుర్రా సాయి మాధవ్ కు అప్పగించారు. నిజానికి ఇది సరైన ఛాయిస్ నే. ఎందుకంటే ఇలాంటి డెప్త్ వున్న సబ్జెక్ట్ కు మరింత లోతైన సంభాషణలు పడాలి. కానీ త్రివిక్రమ్ ఏం చేసారు. సగంలోనే బుర్రాను పక్కకు తప్పించేసారు. తానే రాసారు. తానే ఓకె చేసుకున్నారు. తానే అన్నీ.

తీరా సినిమా చూస్తే, సంభాషణలు రెండు రకాలు

ఒకటి పవన్ పాత్ర మినహా మిగిలిన పాత్రలకు దాదాపుగా తమిళ మాతృక నుంచి తీసుకున్నారు. ఈ పాటి పనికి త్రివిక్రమ్ నే అక్కరలేదు. డబ్బింగ్ సినిమాలకు రాసే వారు ఎవరైనా ఆ పని చాలా తక్కువ ఖర్చుకు చేసేస్తారు

డైలాగుల్లో రెండో అంకం ఏమిటంటే పవన్ పాత్రకు రాయడం. వీటిల్లో కూడా అద్భుతమైన ఆణిముత్యాలు ఏమీ దొర్లలేదు.

ఓక్క సీన్ చూద్దాం. రెండో హీరో క్యారెక్టర్ మరణించింది. తెరమీదకు దేవుడి పాత్ర ప్రవేశించింది. చూసే ప్రేక్షకుడికి, రెండో హీరో పాత్రకు తొలిసారి కాలపురుషుడిని, దేవుడిని తెరమీద చూపిస్తుంటే ఎలా వుండాలి. ఒళ్లు పులకరించ వద్దా? లుంగీ కట్టి, బెల్ట్ పెట్టి ఓ మాస్ గెటప్ లో దేవుడి చూపిస్తే ఫ్యాన్స్ ఈలలు వేస్తారేమో కానీ, నిజమైన ఫీల్ అయితే రాదు. దేవుడి నోట మాట పలికితే, అది మణిమాణిక్యం అంత విలువైనదిగా వుండాలి. అంతే తప్ప చౌకబారుగా కాదు.

కేవలం త్రివిక్రమ్ ఓ కమర్షియల్ ప్రాజెక్ట్ అది కూడా తనకు, పవన్ కు ఉపయోగపడాలని చేసారు..చూసారు తప్ప, పవన్ కెరీర్ లో ఓ మంచి సినిమాగా మిగిలిపోవాలని మాత్రం ఆలోచించనట్లు కనిపించడం లేదు.

మీడియాను తోసేవచ్చు. కానీ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఎవరిని తిడుతున్నారు. ఎవరిని వేలెత్తి చూపిస్తున్నారు అన్నది చూసుకుంటే వాస్తవం బోధపడుతుంది త్రివిక్రమ్ కు కూడా.