అర్చన అలియాస్ వేదా ఒక్కసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె చేసింది అని చెబుతున్న కామెంట్ లు ఒక్కసారి వివిధ నెట్ వర్క్ మాధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కామెంట్లు టాలీవుడ్ లో కూడా కొందరు హీరోయిన్లను వాడుకుంటారన్న నగ్నసత్యాన్ని చాటుతున్నాయి. బాలీవుడ్ లో ఈ వాడకంపై చాలా మంది ఆ మధ్య కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అర్చన మాటలతో టాలీవుడ్ లో కూడా ఈ తరహా వాడకం వుందన్న మాట అనుకుంటున్నారు.
ఓ ప్రముఖ హీరో..తనను, నాకేంటి ఇస్తావ్ అని అడిగాడని, తను ఏమీ ఇవ్వలేనని తప్పించుకోవడంతో, తన పాత్ర నిడివి తగ్గించేసారని అర్చన కామెంట్ చేసినట్లు నెట్ లో చక్కర్లు కొడుతోంది. ఆ కారణంగా ఆ సినిమాలో తన పాత్ర తగ్గించేసారని, ఓ హీరో తనతో కలిసి వేదిక దగ్గరకు రావడానికి ఒప్పుకోలేదని అర్చన చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సినిమా పెద్దలు తనకు అస్సలు సాయం చేయలేదని అర్చన చెప్పినట్లు ఆ వార్తలు వెల్లడిస్తున్నాయి.
ఇంతకీ ఆ హీరో ఎవరు? అమ్మాయిలంటే అమాంతం పడిపోయి, తన సినిమాలో పనిచేసే అమ్మాయిలు పక్కలోకి రావాలని కోరుకునే హీరో ఎవరు అన్నది నెటిజిన్లకు పజిల్ గా మారింది.