పవన్ డిప్లమాటిక్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా డిప్లమాటిక్ గా స్పందించారు. అన్న చిరంజీవి 150 వ సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. చరణ్, మా వదిన సురేఖ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా డిప్లమాటిక్ గా స్పందించారు. అన్న చిరంజీవి 150 వ సినిమా ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150 వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా వుంది. ఖైదీ నెంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మన పూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ ట్వీట్ చేసారు.

అంటే దీన్ని బట్టి పవన్ సభకు హాజరు కావడం లేదని అనుకోవాలి. ఇది నిజంగా మెగాభిమానులకు నిరాశే. సప్తగిరి, నితిన్ లాంటి సహనటుల సభలకు హాజరు కావడం, వారు ఆ విషయాన్ని తమ సినిమాల ప్రమోషన్ కు భారీగా వాడుకోవడం తెలిసిందే. అలాంటిది స్వంత అన్న చిరంజీవి సభకు వెళ్లకపోవడం అంటే కచ్చితంగా మెగాభిమానులు డీలా పడాల్సిన సంగతే. 

పైకి ఎన్ని కబుర్లుచెప్పినా, నా అన్న, నా అన్న అని ఎంత పవన్ పదే పదే పలవరించినా, చిరుకు పవన్ కు మధ్య విబేధాలు వుండనే వున్నాయని ఇండస్ట్రీలోని ఇన్ సైడ్ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతుంటాయి. మెగా ఫంక్షన్లలో పవన్ అభిమానులు వేరుగా వున్నట్లు నానా యాగీచేస్తుంటారు. కక్కలేక, మింగలేక అన్నట్లు మెగా హీరోలు చిరునవ్వులు చిందిస్తుంటారు.ఎందుకంటే పవన్ కు ఆ ఇమేజ్ వున్నంత కాలం వారు ఈ హడావుడి భరించక తప్పదు. అప్పుడప్పుడు నాగబాబు లాంటి వారు బరస్ట్ అవుతుంటారంతే. అల్లు అర్జున్ లాంటి వాళ్లు ఓ లెవెల్ దాకా పోరాడుతుంటారంతే.