ఏమిటి వెంకట్రామయ్యా? ఇది?

తమ తమ నెలవులు తప్పిన…అని వెనకటికి పద్యం వుంది. ప్రతి నటుడికి ఓ స్టయిల్ వుంటుంది. అభిమానులు, ప్రేక్షకులు వారిని అలాగే గుర్తు పడతారు. అభిమానిస్తారు. ఆదరిస్తారు. కాదని వేరే వేరే విధంగా ట్రయ్…

తమ తమ నెలవులు తప్పిన…అని వెనకటికి పద్యం వుంది. ప్రతి నటుడికి ఓ స్టయిల్ వుంటుంది. అభిమానులు, ప్రేక్షకులు వారిని అలాగే గుర్తు పడతారు. అభిమానిస్తారు. ఆదరిస్తారు. కాదని వేరే వేరే విధంగా ట్రయ్ చేస్తే కృతకంగా వుంటుంది. ఆర్ నారాయణ మూర్తి అంటే ఆయనకు కూడా ఓ స్టయిల్ వుంది. బోర విరిచి, గుడ్లు ఉరిమి విప్లవ డైలాగులు చెబుతుంటే బి సి సెంటర్ల జనం సూపర్ అంటారు. అలాంటి ఆర్ నారాయణ మూర్తి ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యగా జయసుధతో సహా థియేటర్లలోకి పండగకు వస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి రెండు డైలాగ్ బిట్ విడియోలు బయటకు వదిలారు. ఇవి చూస్తే పెద్ద హీరోలకు తక్కువ..సంపూర్ణేష్ బాబుకు ఎక్కువ అన్నట్లు వుంది వ్యవహారం. డబ్బులతో నన్ను కొనడానికి సంతలో సరుకు అనుకున్నావ్ రా..పోలీస్ అన్న డైలాగ్ ఏదో పృధ్వీ స్పూఫ్ డైలాగ్ లా వుంది. అలాగే రెండో విడియోలో డైలాగులు ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేసినట్లు వున్నాయి.

ఇలా కాకుండా ఆర్ నారాయణ మూర్తి ఆయన స్వంత స్టయిల్ లోనే చెప్పి వుంటే బాగుండేదేమో? అన్నట్లు ఈ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి సూపర్ టాప్ హీరోల రేంజ్ లో ఫైట్లు చేసినట్లు కూడా చూపించారు. కోడ్తే..రౌడీలు గాల్లో గింగిరాలు తిరగడమే.