ఎన్టీఆర్ కూడా అదుర్సేనంట

హరీష్ శంకర్ ఎప్పుడో అదుర్స్ సినిమా తరువాత తయారుచేసిన లైన్ అదుర్స్ 2. ఆ లైన్ అలా అలా చేతులు మారి బన్నీ దగ్గరకు వచ్చి దువ్వాడ జగన్నాధమ్ గా ముస్తాబవుతోంది. ఇందులో బన్నీ…

హరీష్ శంకర్ ఎప్పుడో అదుర్స్ సినిమా తరువాత తయారుచేసిన లైన్ అదుర్స్ 2. ఆ లైన్ అలా అలా చేతులు మారి బన్నీ దగ్గరకు వచ్చి దువ్వాడ జగన్నాధమ్ గా ముస్తాబవుతోంది. ఇందులో బన్నీ అదుర్స్ లో ఎన్టీఆర్ మాదిరిగా బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ యాస,భాష అన్నీ. 

ఇదిలా వుంటే ఎన్టీఆర్-బాబీ కాంబినేషన్ లో తయారవుతున్న ముగ్గురు క్యారెక్టర్ల సినిమా కూడా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో అదుర్స్ లైన్ లోనే వుంటుందని తెలుస్తోంది. అదుర్స్ లో రెండు క్యారెక్టర్లు వాటి మధ్య కన్ఫ్యూజన్ ఎలా అయితే నవ్వులు పండించిందో, ఈ సినిమాలో కూడా అదే విధంగా మూడు క్యారెకర్లలో రెండు క్యారెక్టర్లు నవ్వులు పూయిస్తాయట. 

అయితే ఈ మూడు క్యారెక్టర్లలో ఒకటి మళ్లీ అదుర్స్ లో మాదిరిగా బ్రాహ్మిన్ క్యారెక్టర్ వుంటుందా?వుండదా? అన్నది మాత్రం కాస్త గోప్యంగానే వుంచారు. గతంలో చిరు, కమల్ హాసన్ ఇలా మూడు పాత్రలు పోషించినపుడు అలాంటి పాత్రలు చేసారు. మొత్తానికి వివి వినాయక్ సృష్టించిన అదుర్స్ సినిమా ఆయన ప్రమేయం లేకుండానే మరో రెండు సినిమాలకు దారి తీస్తోందన్నమాట.