డైరక్టర్ క్రిష్ కు తన ప్రొడక్ట్ శాతకర్ణిపై మాంచి ధీమాగా వున్నట్లుంది. ఇప్పటికి తన సినిమాలోని మేజర్ పోర్షన్ ను ఇండస్ట్రీలోని చాలా మందికి చూపించేసాడని తెలుస్తోంది. ముఖ్యంగా కొనేందుకు అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లు చాలా మందికి స్వయంగా పిలిచి, ఆయన ఆఫీస్ లోనే చూపించేసారని తెలుస్తోంది. అలాగే ముంబాయి పని మీద వెళ్లినపుడు ప్రత్యేకంగా డైరక్టర్ రామ్ గోపాల్ వర్మను కూడా కలిసి చూపించినట్లు తెలుస్తోంది.
ఇలా చూపించిన సినిమా నలభై నిమషాలు పైగానే వుందని తెలుస్తోంది. దీంతో చూసిన ప్రతివాళ్లూ, సినిమా సూపర్ గా వుంది. అసలు ఇది బాలయ్య సినిమానేనా? అనేటట్లు వుంది. ఓ మాంచి చారిత్రాత్మక సినిమా చూసినట్లు వుంది తప్ప, బాలకృష్ణ హీరోయిజం సినిమా చూస్తున్నట్లు అనిపించలేదు అనే టాక్ ను వినిపిస్తున్నారు. పాటలు కానీ, యుద్దాలు కానీ ఓ రేంజ్ లో వచ్చాయంటున్నారు.
మరి ఇలాంటి టాక్ స్ప్రెడ్ కావడం కోసమే క్రిష్ చాలా మందికి సినిమా చూపించినట్లా? ఇదీ ఒక విధంగా సినిమాకు ప్లస్ అవుతుందని ఆయన ఈ స్ట్రాటజీ వేసారా? లేక తన ప్రొడక్ట్ బాగా వచ్చిందన్న నమ్మకం, దానిమీద ప్రేమతో చూపించారో? 12న తెలుస్తుంది.