Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ధృవ'లా 'ఖైదీ' ఆ భజన చేసెయ్యొచ్చుగా.!

'ధృవ'లా 'ఖైదీ' ఆ భజన చేసెయ్యొచ్చుగా.!

హైద్రాబాద్‌లో 'ధృవ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. పైగా, ఆ ఈవెంట్‌కి స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఫ్‌కోర్స్‌, ఆ వేదికపై కేటీఆర్‌ భజనలో 'ధృవ' టీమ్‌ మునిగిపోయిందనుకోండి.. అది వేరే విషయం. అదే సమయంలో, కేటీఆర్‌ కూడా - చిరంజీవి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. 

తెలంగాణలో, 'ధృవ' సినిమాకి సాధ్యమయ్యింది, ఆంధ్రప్రదేశ్‌లో 'ఖైదీ' సినిమాకి ఎందుకు అంత తేలిగ్గా సాధ్యం కావడంలేదు.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కిందా మీదా పడి, ఆడియో ఫంక్షన్‌ని అటకెక్కించి, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని పోస్ట్‌పోన్‌ చేసి.. 'ఖైదీ' టీమ్‌ పడరాని పాట్లూ పడ్తోంది. ఏం, చంద్రబాబుని బుజ్జగించి.. ఆయన్ను ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి ఆహ్వానించి వుండొచ్చుగా.? అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అయినాసరే, చంద్రబాబు అసలు 'ఖైదీ' టీమ్‌కి యాక్సెస్‌ ఇవ్వలేదన్న వాదనా లేకపోలేదు. 

మొత్తమ్మీద, ఇప్పుడు తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌లలో సినీ పరిశ్రమకి ఎక్కడ అనుకూల పరిస్థితులు వున్నాయో అర్థమవుతోందనీ, చంద్రబాబు ఈ విషయంలో హుందాగా వ్యవహరించడంలేదన్న 'మెసేజ్‌' అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో, మెగా క్యాంప్‌, టీఆర్‌ఎస్‌తో సర్దుకుపోతోందిగానీ, టీడీపీతోనే సర్దుకుపోలేక ఇబ్బందులు కొనితెచ్చుకుంటోందన్న వాదనా బలపడ్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?