Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఖైదీ లెవెల్ తగ్గిస్తున్న హ్యాయ్ లాండ్?

ఖైదీ లెవెల్ తగ్గిస్తున్న హ్యాయ్ లాండ్?

విజయవాడ సిద్దార్థ గ్రౌండ్ కుదరలేదు. నిబంధనలు అడ్డం పడడంతో ఇందిరా ప్రియదర్శిని మైదానం సెట్ కాలేదు. కోనేరు వాళ్లు ఇస్తామన్నా ఎందుకో తీసుకోలేదు. ఆఖరికి హాయ్ లాండ్ వేదికతో సెటిల్ అయ్యారు. గుంటూరు అనుకున్నారు కానీ, లాస్ట్ మినిట్ లో ఎవరైనా ఏ లిటిగేషన్ పెడతారో అని చిన్న అనుమానం. హాయ్ లాండ్ అయితే ప్రయివేటుది కాబట్టి సమస్యలేదు. 

అయితే వాస్తవానికి ఈ ప్రీ సక్సెస్ మీట్ ను నభూతో, న భవిష్యతి అన్న టైపులో చేయాలని అనుకున్నారు ఖైదీ నెం 150 యూనిట్. కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు. ఎందుకంటే హాయ్ ల్యాండ్ లో మరీ ఎక్కి తొక్కినంత మందిని చేరిస్తే, పది వేల మంది పట్టడం కష్టమని తెలుస్తోంది. వాస్తవానికి కొద్ది నెలలుగా ఈ ఈవెంట్ కు జనం అంతా తరలి రావాలని అభిమానులు ఆంధ్ర, తెలంగాణ అంతా చాలా హడావుడి చేసారు. ఫ్యాన్స్ మీట్ లు నిర్వహించారు. టార్గెట్ లు నిర్దేశించారు. చేయాల్సిన పనుల డిసైడ్ చేసారు. కానీ ఇప్పుడు హ్యాయ్ లాండ్ వెన్యూ వల్ల అవన్నీ సాధ్యం కాదని తెలుస్తోంది. ఇంతవరకు హ్యాయ్ లాండ్ లో చిన్న చిన్న సినిమా గ్యాదరింగ్ లే తప్ప, భారీ ఫంక్షన్లు జరగలేదు.

తెలుగుదేశం తంటాలు

ఇదిలా వుంటే ఖైదీ ఈవెంట్ కు గ్రౌండ్ సెట్ కాకపోవడానికి తాము ఎంత మాత్రం కారణంగా కాదని చెప్పుకోవడానికి తెలుగుదేశం నాయకులు కిందా మీదా అవుతున్నారు. దీనివల్ల కాపుల్లో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుందని భయపడుతున్నారు. అందుకే ఎవరిస్థాయిలో వారు, ఏదో విధంగా మీడియాకు విషయం వివరిస్తున్నారు. ఖైదీ సభకు విజయవాడలోనే కావాలంటే తాము మరో వెన్యూ చూపించడానికి సిద్ధమని తెలుగుదేశం నాయకులు సమాచారం పంపుతున్నారు. అసలు ఆ మైదానంలో సమావేశానికి అవకాశం వుండదని అందరికీ తెలుసు అని, తెలిసి మరీ అదే మైదానం ఎంచుకుని, ఇప్పుడు ఇలా ప్రచారం సాగించడం సరి కాదని తెలుగుదేశం జనాలు వివరిస్తున్నారు. 

అంతా అయోమయం

ఖైదీ సినిమాకు సంబంధించి ఏ నిర్ణయమైనా రామ్ చరణ్ తీసుకోవాల్సిందే. ఆయన ఫారిన్ లో వున్నారు. ఇక్కడ వున్నవారంతా జస్ట్ సమాచారం పాస్ ఆన్ చేసే జనాలే. దాంతో అభిమానులకు సరైన దిశా నిర్దేశం చేసేవారే కరువయ్యారు. క్లియర్ గా ఎవరు రావాలి? ఎందరు రావాలి? పాస్ ల సంగతేమిటి అన్నది ఇంకా తెలియడం లేదు. ఈ సాయంత్రమే పాస్ ల ముద్రణ ప్రారంభమైంది. రామ్ చరణ్ వచ్చాక కానీ, మొత్తం విధివిధానాలు క్లియర్ కావని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?