మహేష్ బాబు న్యూఇయర్ పూటా తన అప్ కమింగ్ సినిమాల గురించి క్లారిటీగా ట్వీట్ చేసారు. కేవలం ఎవరెవరితో సినిమాలు చేస్తున్నాను అనేదే కాకుండా, ఏయే బ్యానర్లలో చేస్తున్నా అనేది కూడా క్లారిటీ ఇచ్చేసారు. కానీ చాలా తెలివిగా ఈ క్లారిటీలో పివిపితో సమస్య గురించి మాత్రం ప్రస్తావించలేదు.
పైగా ఇంజెక్షన్ ఆర్డర్ వున్నా కూడా అశ్వనీదత్-దిల్ రాజు-వంశీపైడిపల్లి సినిమా చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. అంటే ఏమనుకోవాలి? పివిపి వివాదాన్ని జస్ట్ ఆయన ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేదు అనే అనుకోవాలి? లేదా ఈ వివాదం ఏమంత అడ్డంకి కాదనొ, దాన్ని దాటేయగలమనే ధీమానో వుండి వుండాలి.
పివిపితో కూర్చుంటే సమస్య సద్దుమణిగిపోతుందనొ, లేక ఇప్పటికే తెరవెనుక ఏదో జరిగిందనో టాక్ వినిపిస్తోంది. అందుకే ఎటువంటి కన్ఫ్యూజన్ వుండకూడదనే మహేష్ బాబు ఇంత క్లారిటీ ఇచ్చారంటున్నారు. నిజానికి ఈ మూడు ప్రాజెక్టులు కొత్తవేమీ కాదు. వీటి వివరాలు అన్నీ జనాలకు పూర్తిగా తెలిసినవే.
వెబ్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలుగా నలిగిపోయిన వైనమే. అటు కొరటాల శివ సినిమా కానీ, త్రివిక్రమ్ ప్రాజెక్టు కానీ కొత్తవేమీ కాదు. ఎటొచ్చీ ఇప్పుడు అఫిషియల్ గా మహేష్ చెప్పాడంతే. ఇలా చెప్పడం వెనుక పివిపి తో వివాదమే కారణం అని వినికిడి.