ఒక వైపు సంప్రదాయ వాదులు.. నివ్వెర పోతుంటే, సైంటిస్టులు మాత్రం, లవ్ అండ్ సెక్స్ విత్ రోబోట్స్ అని అంటున్నారు. వచ్చే ఏడాది కల్లా వీటిని ఆవిష్కరించేస్తాం.. ఎంచక్కా వీటితో శృంగారమాచరించండి అని అనేస్తున్నారు! శంకర్ రోబో సినిమాలో ఒక రోబోలో ప్రేమ ఫీలింగ్స్ కలుగుతాయి, “సెక్స్ బోట్స్’’ వ్యవహరించే ఈ రోబోట్స్ కు మాత్రం శృంగార శాస్త్రంపై కూడా మంచి ప్రావీణ్యం ఉంటుందట!
ఇవి మాట్లాడతాయి, మీ శృంగార ఆసక్తులను తెలుసుకుంటాయి, మనిషిలాగా మెదులుతాయి.. హ్యూమన్ తో సెక్స్ లో పాల్గొనడానికి, ఈ హ్యూమనాయిడ్ తో సెక్స్ కి ఏ మాత్రం తేడా ఉండదని ఇటీవల లండన్ లో ఈ సెక్స్ రోబోట్స్ విషయంలో జరిగిన కాన్ఫరెన్స్ లో శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. మరెంతో సమయం పట్టదు.. కొన్ని నెలల్లోనే వీటిని అందుబాటులోకి తెస్తామని వారు ప్రకటించేశారు కూడా!
ఇదే కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కొంతమంది ఈ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. ఇది అరాచకానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. సృష్టికి విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి రోబోలు అందబాటులోకి వస్తే మనిషిని మనిషి ప్రేమించుకోవడమే ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే సైంటిస్టులు ఈ వాదనతో ఏకీభవించలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో సెక్స్ రోబోట్స్ సరికొత్త విప్లవమని వారు వాదించారు. వీటి విషయంలో సామాజిక పరిణామాల గురించి ఆందోళన చెందనక్కర్లేదని కూడా అన్నారు. పోర్న్ విచ్చల విడిగా అందుబాటులో ఉంది, కానీ.. స్త్రీ, పురుషుల కలయికను అది ఏం ఆపడం లేదు.. అలాగే ఈ సెక్స్ రోబోట్స్ కూడా సృష్టిని నాశనం చేసేవి కావు.. అని వీటి రూపకర్తలు అన్నారు.
బ్రిటన్ కు చెందిన కొన్ని పరిశోధనాలయాలు, అమెరికాకు చెందిన మరికొన్ని సంస్థలు సెక్సోబోట్స్ తయారు చేయడంలో నిమగ్నం అయి ఉన్నాయి. ఇక ఇప్పటికే స్త్రీ, పురుషుల కలయిక లేక జనాభా తగ్గిపోతున్న దేశంగా నిలిచిన జపాన్ వాళ్లు కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ సెక్స్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడానికి వారీతో పోటీలు పడుతున్నారు. మెకానికల్ సెక్స్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి వివిధ రకాల డివైజ్ ల రూపకల్పన ప్రణాళికలను ఆ సైన్స్ కాంగ్రెస్ లో జపాన్ వాళ్లు వివరించారు.
స్త్రీ, పురుష స్పర్శ అవసరం లేకుండా.. శృంగార సంతృప్తే ధ్యేయం అని వీళ్లు మూకుమ్మడిగా ప్రకటించారు. మరి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఇప్పటికే మానవుల మధ్య అనుబంధ బాంధవ్యాలను చాలా వరకూ తుంచేస్తోంది, ఇక వీళ్ల ప్రగతి చూస్తుంటే.. ప్రపంచాన్ని మరింతగా విపత్తుల పాల్జేసేలా ఉన్నారు.