కాలం ఎవర్నయినా మార్చేస్తుంది. 'అబ్బే, నేను అస్సలు ఎక్స్‌పోజింగ్‌కి ఒప్పుకోను.. గ్లామర్ పేరుతో చేసే ఎక్స్పోజింగ్ నాకస్సలు నచ్చదు. అవకాశాల్లేకపోతే, సినిమాలు వదిలేసుకుంటానుగానీ అవకాశాల కోసం ఎక్స్పోజింగ్ చేసే ప్రసక్తే లేదు..' అని చాలామంది హీరోయిన్లు చెప్పినట్లే నిన్న మొన్నటిదాకా 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్ కూడా చెబుతూ వచ్చింది.
కానీ, ఇప్పుడు కీర్తి సురేష్ మాటల్లో 'గ్లామరస్ ఛేంజ్' కన్పిస్తోంది. తెరపై అందంగా కన్పించడంలో తప్పేమీ లేదంటోంది. అయితే గ్లామర్‌కీ ఓ హద్దుంటుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. తన వరకూ ఇప్పటిదాకా అలాంటి గ్లామరస్ పాత్రలేమీ రాలేదనీ, వస్తే, అప్పుడు ఆలోచిస్తాననీ సమాధానమిచ్చింది కీర్తి సురేష్. అప్పటికీ ఇప్పటికీ వల్గారిటీ విషయంలో తనది ఒకటే మాట అని మాత్రం చెప్పిందామె.
గ్లామర్‌కీ వల్గారిటీకి తేడాలు చెప్పడంలో హీరోయిన్ల రూటే సెపరేటు. కీర్తి సురేష్ కూడా ఆ తెలివితేటలే ప్రదర్శిస్తున్నట్టుంది. పవన్ సరసన ఓ సినిమాలో ఛాన్స్ రావడం, కోలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వస్తుండడం చూస్తోంటే గ్లామర్ విషయంలో కీర్తి కొన్ని గీతలు దాటేందుకు సిద్ధమయ్యిందనే అనుమానం కలగకమానదు. ప్రస్తుతానికైతే కీర్తి సురేష్ నటించిన 'నేను లోకల్' సినిమా విడుదలకు సిద్ధవుతోంది. నాని హీరోగా నటించాడీ చిత్రంలో. తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా చేస్తున్న కీర్తి, విశాల్ సరసన తాజాగా ఓ సినిమాలో కమిటయ్యింది.