మార్కెట్ లో సరైన సినిమా ఈవారం కూడా రాకపోవడం అన్నది ధృవ కు కలిసి వచ్చింది. శనివారం కాస్త మంచి కలెక్షన్లే నమోదు చేసింది. పైగా ఆదివారం కూడా ఇదే మాదిరిగా వుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వారం విడుదలైన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడం, ధృవకు పోటీగా పెద్ద సినిమా ఏదీ లేకపోవడం అన్నది బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో నైజాం మార్కెట్ బాగానే పుంజుకుంది.
శనివారం ధృవ కలెక్షన్లు ఇలా వున్నాయి.
కృష్ణ 9,63,630
నెల్లూరు 4,23,000,
గుంటూరు 9,12,000
సీడెడ్ 23 లక్షలు
నైజాం 64 లక్షలు
ఈస్ట్ 9.48 లక్షలు
వెస్ట్ 5,86, 494
ఈలెక్కన ఆదివారం కూడా ఇలాగే వుంటే కృష్ణ, సీడెడ్ లో కొన్న లోకల్ బయ్యర్లు, వైజాగ్, గుంటూరు, నెల్లూరు బయ్యర్లకు కాస్త ధైర్యం వస్తుంది. పైగా వచ్చేవారం కూడా పెద్దగా పోటీ లేదు. ఇక ధృవ మాత్రమే ఆప్షన్ అంటే కనుక, బ్రేక్ ఈవెన్ కాకపోయినా, భారీ నష్టాలు అయితే రాకుండా వుండే పరిస్థితి వుంటుంది.
శాటిలైట్, కొన్ని ఏరియాలు అమ్మడం వల్ల నిర్మాతలు సేఫ్ జోన్ కు చేరుకునే అవకాశం వుందేమో కానీ, బయ్యర్లు మాత్రం కాస్త అనుమానమే.