మిగిలిన విషయాలు ఎలా వున్నా, ఉపన్యాసాల దగ్గరకు వచ్చేసరి బాలయ్య చిన్నపిల్లాడే. ఏది మాట్లాడాలో? ఎలా మాట్లాడాలో? వేదిక ఏమిటో? సందర్భం ఏమిటో? ఇవేవీ పట్టించుకోరు. అమాకయకంగా తన మనసులో మాటలు అలా అలా మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. పాపం ఆయన దగ్గర విషయం వుంటుంది. కానీ మాట్లాడే ఫ్లో వుండదు. మంత్రాలు, శ్లోకాలు, పద్యాలు, ఇలా ఒకటేమిటి అన్నీ వాటి చిత్తానికి అవి ఉపన్యాసంలో దూరిపోతుంటాయి.
గతంలోనూ, నిన్నటి శాతకర్ణి మీటింగ్ లోనూ బాలయ్య ఒక విషయం ప్రస్తావించారు. ఆయన మాటలు జాగ్రత్తగా వింటే, ఈ విషయం అర్థమవుతుంది.
తాను ఏదీ అనుకోనని, తన జీవితంలో సంఘటనలు చిత్రంగా సంభవిస్తుంటాయని అన్నారు. సింహాలో డాక్టర్ క్యారెక్టర్ పోషించానని, డాక్టర్ కావాలని తాను ఎన్నడూ అనుకోలేదని, కానీ, చిత్రంగా ఆ తరువాత క్యాన్సర్ ఆసుపత్రి మేనేజ్ మెంట్ చేయాల్సి వచ్చిందని అన్నారు.
అలాగే లెజెండ్ సినిమా చేసానని, ఆ తరువాత ఎమ్మెల్యే అయ్యానని చెప్పారు.
ఇక్కడ ఆయన చెప్పలేదు కానీ, ప్రస్తుతం సార్వభౌముడు..చక్రవర్తి క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే ఇక ఆయన పాలకుడు అవుతారా? ఈ జనరేషన్ లో పాలకుడు అంటే ముఖ్యమంత్రేగా? ఏమో బాలయ్య జాతకం అలాంటిదేమో? ఎవరికి తెలుసు. ఎన్టీఆర్ పిల్లలు ఎవరికీ పట్టని అదృష్టం బాలయ్యకు పట్టింది. అలాగే ఆ పదవి కూడా దక్కుతుందేమో?