రాజ్ తరుణ్ తప్పుటడుగులు

రాజ్ తరుణ్ సినిమా వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది. మరో రెండు నెలలకు కానీ సినిమా వచ్చేలా లేదు. కిట్టుగాడు వున్నాడు జాగ్రత్త సినిమా ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అనడమే కానీ, రావడం కనిపించడం…

రాజ్ తరుణ్ సినిమా వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది. మరో రెండు నెలలకు కానీ సినిమా వచ్చేలా లేదు. కిట్టుగాడు వున్నాడు జాగ్రత్త సినిమా ఇదిగో వస్తుంది..అదిగో వస్తుంది అనడమే కానీ, రావడం కనిపించడం లేదు. నవంబర్, డిసెంబర్ ల్లో సినిమా రెడీ అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ప్యాచ్ వర్క్ లు, అయిటమ్ సాంగ్ జోడింపులు అంటున్నారు. స్క్రిప్ట్ లోనే సెకండాఫ్ కొంచెం వీక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అందువల్ల ఆ విషయంలో చిన్న చిన్న రిపేర్లు, అయిటమ్ సాంగ్ జోడించడాలు తప్పడం లేదని వినికిడి. ఇవన్నీ ఇప్పుడు చేయాలని ప్లానింగ్ ప్రారంభించారు. పైగా రాజ్ తరుణ్ ఇప్పుడ వెలిగొండ శ్రీనివాస్ డైరక్షన్ లో ఒకటి, అన్నపూర్ణ బ్యానర్ లో తమిళ దర్శకురాలితో ఒకటి సినిమాలు చేస్తున్నాడు. ఆ గ్యాప్ లో ఈ రిపేర్లు జరగాలి. అంటే జనవరి నెల దానికే సరిపోతుంది. ఫిబ్రవరిలో సందు చూసుకుని విడుదల చేయాలి. 

సినిమా చూపిస్తామావా, వీడోరకం ఆడోరకం తెచ్చిన క్రేజ్ అంతా నీరుగారిపోతోంది. రాజ్ తరుణ్ ప్లానింగ్ లో ఎక్కడో తేడా కొడుతోంది. దర్శకులను ఎంచుకోవడంలోనే తేడా అంతా అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రాజ్ తరుణ్ కు దర్శకత్వంపై ఆసక్తి వుండడంతో, కొత్త, చిన్న దర్శకులతో ఎక్కువగా వెళ్తూ, తను కూడా వాళ్లతో పని చేయాలనుకుంటున్నాడని, కానీ దాని వల్ల ప్రాజెక్టులు అనుకున్నట్లు సాగడం లేదని టాక్. మరి రాజ్ తరుణ్ ఎప్పుడు రియలైజ్ అవుతాడో? మిగిలిన యంగ్ హీరోల మాదిరిగా మంచి డైరక్టర్లను ఎప్పుడు పట్టుకుంటాడో?