యామీ గౌతమ్.. అంటే తెలుగు సినీ ప్రేక్షుకులకి ఓ సాదా సీదా హీరోయిన్ మాత్రమే గుర్తుకొస్తుంది. నితిన్‌తో 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సినిమాలో నటించిన ఈ బ్యూటీ, అంతకు ముందు 'గౌరవం' అనే మరో సినిమాలో నటించింది. బాలీవుడ్లో మాత్రం యామీకి 'విక్కీ డోనర్' రూపంలో పెద్ద సక్సెస్సే వుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు మేజర్ ప్రాజెక్టుల్ని తన ఖాతాలో వేసుకుంది. అందులో ఒకటి 'కాబిల్' కాగా, ఇంకోటి 'సర్కార్-3'.
'కాబిల్' సినిమాతో ఇప్పుడు యామీ పేరు బాలీవుడ్లో ఓ రేంజ్లో మార్మోగిపోతోంది. అంతేనా, ఈ సినిమా తెచ్చిన పేరు ప్రఖ్యాతుల పుణ్యమా అని బాలీవుడ్లో యామీ రెమ్యునరేషన్ కోటికి పైగానే పలుకుతోందట. అక్కడితో ఆగితే, ఆమె యామీ గౌతమ్ ఎందుకవుతుంది.? రెండు కోట్లకు పైనే డిమాండ్ చేస్తోందట యామీ గౌతమ్ ఇప్పుడు.
ఇదంతా నిజమేనా.? అని ప్రశ్నిస్తే, 'అబ్బే, అవన్నీ పుకార్లు మాత్రమే.. రెమ్యునరేషన్ డిసైడ్ చేసేది నిర్మాతలే.. మేం అడిగినంత ఇచ్చేయరు కదా.. అయినా డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా రెమ్యునరేషన్ పెరిగిపోతుంది కదా..' అంటూ అసలు విషయం చెప్పేసింది. ఇప్పుడే ఇలా వుంటే, 'కాబిల్' విడుదలై సక్సెస్ అయితే, యామీ గౌతమ్‌ని పట్టుకోగలమా.? ఛాన్సే లేదు.