టెస్ట్ మ్యాచ్‌లలో ఇన్నింగ్స్ విక్టరీ ఎప్పుడూ వెరీ వెరీ స్పెషల్‌గానే వుంటుంది. చాలా అరుదుగా మాత్రమే ఈ ఫీట్‌ని ఏ జట్టు అయినా సాధిస్తుంటుంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇన్నింగ్స్ విక్టరీతో, సిరీస్‌ని టీమిండియా కైవసం చేసుకోవడం విశేషం. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా, మూడో టెస్ట్‌లో విక్టరీతో ఇంగ్లాండ్‌ని వైట్ వాష్ చేసేందుకు మార్గం సుగమం చేసుకుంది. చివరి టెస్ట్‌లోనూ ఇంగ్లాండ్ పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కన్పించడంలేదు.
కోహ్లీ మూడో టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేస్తే, రెండు ఇన్నింగ్స్‌లోనూ ఆరేసి వికెట్లతో మొత్తం 12 వికెట్లు సాధించి అరుదైన ఫీట్‌ని సొంతం చేసుకున్నాడు అశ్విన్. మొత్తంగా టెస్ట్ కెరీర్లో ఇలా ఏడోసారి అశ్విన్ 10 వికెట్లకుపైగా సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో అనిల్ కుంబ్లే (8 సార్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు అశ్విన్.
చివరి రోజు ఆటకు ముందు కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మాటల తూటాలు పేల్చేశారు. కోహ్లీలో అద్భుతమైన బ్యాట్స్‌మెన్ ఏమీ లేడనీ, అతని బ్యాటింగ్‌లో చాలా లోపాలున్నాయనీ, సొంత పిచ్‌లు అతనికి కలిసొచ్చాయని ఓ బౌలర్ అంటే, మ్యాచ్‌ని అంత తేలిగ్గా చేజార్చుకోబోమంటూ మరో ఇంగ్లాండ్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. దాంతో, టీమిండియాలో కసి ఇంకా బాగా పెరిగినట్లుంది.
కేవలం 8 ఓవర్లు.. నాలుగు వికెట్లు.. ఇదీ ఐదో రోజు మ్యాచ్‌లో భారత బౌలర్ల తీరు. కేవలం 13 పరుగులిచ్చి ఐదో రోజు ఆట ముగించేసింది టీమిండియా. ప్రతిఘటన సంగతి దేవుడెరుగు.. కనీసం, ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోడానికి కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ప్రయత్నించలేకపోయారు. ఫలితం 36 పరుగులు, ఇన్నింగ్స్ తేడాతో టీమిండియా, ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా పలుమార్లు టీమిండియాని ఇన్నింగ్స్ విక్టరీ ఊరించింది. చివరకు, ఇన్నింగ్స్ విక్టరీ టీమిండియా వశమైంది.