చరణ్ టార్గెట్ నా? బయ్యర్ టార్గెట్ నా?

ఓవర్ సీస్ లో ధృవ కలెక్షన్లపై అంచనాలు భలేగా వున్నాయి.  141 లోకేషన్లలో ప్రీమియర్లకు 223,341 డాలర్లు వచ్చాయి. దీంతో ఇక మిలియన్ డాలర్లు కేకువాకే అంటూ ప్రకటనలు కనిపించాయి. వన్ మిలియన్ క్లబ్…

ఓవర్ సీస్ లో ధృవ కలెక్షన్లపై అంచనాలు భలేగా వున్నాయి.  141 లోకేషన్లలో ప్రీమియర్లకు 223,341 డాలర్లు వచ్చాయి. దీంతో ఇక మిలియన్ డాలర్లు కేకువాకే అంటూ ప్రకటనలు కనిపించాయి. వన్ మిలియన్ క్లబ్ అన్నది రామ్ చరణ్ కల. అది నెరవేరుతుందా? లేదా అన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే సినిమాలో విషయం వుంటే ఆటోమెటీక్ గా చేరిపోతుంది. 

అయితే వన్ మిలియన్ క్లబ్ లో చేరితే రామ్ చరణ్ హ్యాపీ కావచ్చు. కానీ అంతమాత్రం చేత బయ్యర్ హ్యాపీ కాదు. ఎందుకంటే ధృవ ఓవర్ సీస్ హక్కులు 5.25 కోట్లకు విక్రయించారు. ఓవర్ సీస్ లో వచ్చిన ఆదాయంలో నలభై శాతం ఖర్చులే పోతాయి. పైగా ఈ సారి పబ్లిసిటీ ఖర్చు కూడా ఓవర్ సీస్ బయ్యర్ మీద కాస్త గట్టిగానే పడింది. 

అంటే వన్ మిలియన్ వస్తే అమ్మిన డబ్బులు రావు.  కనీసం వన్ అండ్ హాఫ్ మిలియన్ చేస్తే అక్కడికి బయ్యర్ గట్టెక్కుతారు. అంటే వన్ మిలియన్ చేస్తే, రామ్ చరణ్ మాత్రమే హ్యాపీ. వన్ అండ్ హాఫ్ మిలియన్ చేస్తేనే బయ్యర్ హ్యాపీ. బ్రూస్ లీ దెబ్బ నుంచి ఓవర్ సీస్ బయ్యర్ ఇప్పటికీ తెరుకోలేదు. ఇప్పుడు ధృవను కొన్నది కొత్త బయ్యర్. మరి ధృవ ఎంత చేస్తుందో చూడాలి.