అల్లు అరవింద్ తన చాకచక్యం మరోసారి ప్రదర్శించారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే ఎలాగోలా ధృవ శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు. 9.50 కోట్లకు జెమిని తో ఒప్పందం చేసేసుకున్నారు. నిజానికి సినిమా విడుదల తరువాత అయితే ఈ మొత్తం కాస్త తగ్గి వుండేదని ఇండస్ట్రీ టాక్.
ఎందుకంటే ఫ్యామిలీ వ్యూవర్ షిప్ లు ఎక్కువగా కానీ, కచ్చితంగా కానీ వుంటాయనుకునే సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎక్కువ పలుకుతుంది. ధృవ సినిమా ఆ విషయంలో కాస్త మైనస్. ఈ మైండ్ గేమ్ మూవీ సీరియళ్లు అంటే ఇష్టపడే ఆడవాళ్లకు ఏ మేరకు పడుతుందన్నది అనుమానం. అందుకే సినిమా విడుదల హడావుడిలో వుంటూ కూడా, జెమినితో డిస్కషన్లు కంటిన్యూయస్ గా నడిపి, శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు అరవింద్.
ధృవ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 57 దాకా అయ్యిందని వినికిడి. ఈ సినిమా రీమేక్ రైట్స్ నే నాలుగు కోట్లకు పైగా ఇచ్చి తీసుకున్నారు. సో, ఆ యాభై ఏడులో తొమ్మదిన్నర రికవరీ అయిపోయింది. ధృవను అల్లు అరవింద్ దాదాపు డైరక్ట్ గా విడుదల చేసుకున్నారు.