ధృవ శాటిలైట్ @9.50 కోట్లు

అల్లు అరవింద్ తన చాకచక్యం మరోసారి ప్రదర్శించారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే ఎలాగోలా ధృవ శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు. 9.50 కోట్లకు జెమిని తో ఒప్పందం చేసేసుకున్నారు. నిజానికి సినిమా…

అల్లు అరవింద్ తన చాకచక్యం మరోసారి ప్రదర్శించారు. సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే ఎలాగోలా ధృవ శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు. 9.50 కోట్లకు జెమిని తో ఒప్పందం చేసేసుకున్నారు. నిజానికి సినిమా విడుదల తరువాత అయితే ఈ మొత్తం కాస్త తగ్గి వుండేదని ఇండస్ట్రీ టాక్. 

ఎందుకంటే ఫ్యామిలీ వ్యూవర్ షిప్ లు ఎక్కువగా కానీ, కచ్చితంగా కానీ వుంటాయనుకునే సినిమాలకు శాటిలైట్ రైట్స్ ఎక్కువ పలుకుతుంది. ధృవ సినిమా ఆ విషయంలో కాస్త మైనస్. ఈ మైండ్ గేమ్ మూవీ సీరియళ్లు అంటే ఇష్టపడే ఆడవాళ్లకు ఏ మేరకు పడుతుందన్నది అనుమానం. అందుకే సినిమా విడుదల హడావుడిలో వుంటూ కూడా, జెమినితో డిస్కషన్లు కంటిన్యూయస్ గా నడిపి, శాటిలైట్ బిజినెస్ పూర్తి చేసేసారు అరవింద్. 

ధృవ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 57 దాకా అయ్యిందని వినికిడి. ఈ సినిమా రీమేక్ రైట్స్ నే నాలుగు కోట్లకు పైగా ఇచ్చి తీసుకున్నారు. సో, ఆ యాభై ఏడులో తొమ్మదిన్నర రికవరీ అయిపోయింది. ధృవను అల్లు అరవింద్ దాదాపు డైరక్ట్ గా విడుదల చేసుకున్నారు.