ఇటలీ వెళ్లి వచ్చిన త్రివిక్రమ్

దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల ఇటలీ వెళ్లి వచ్చారు. త్వరలో చేయబోయే పవన్ కళ్యాణ్ సినిమా కు లొకేషన్లు చూడ్డానికి కాదు. పూరి జగన్నాధ్ మాదిరిగా ఒంటరిగా ఓ హోటల్ లో కూర్చుని స్క్రిప్ట్ రాసుకోవడానికి…

దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల ఇటలీ వెళ్లి వచ్చారు. త్వరలో చేయబోయే పవన్ కళ్యాణ్ సినిమా కు లొకేషన్లు చూడ్డానికి కాదు. పూరి జగన్నాధ్ మాదిరిగా ఒంటరిగా ఓ హోటల్ లో కూర్చుని స్క్రిప్ట్ రాసుకోవడానికి కాదు. తను కట్టుకుంటున్న డ్రీమ్ హవుస్ కు మాంచి ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు. 

దర్శకుడు త్రివిక్రమ్ ఫిల్మ్ నగర్ సమీపంలో మాంచి ఇల్లు నిర్మించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఇల్లు స్థలం ఖరీదే పది కోట్లు. మాంచి అభిరుచితో త్రివిక్రమ్ తన ఇల్లు నిర్మించుకుంటున్నారు. సాధారణంగా ఫర్నిచర్ కోసం ఇటీవల కాస్త డబ్బు వున్నవాళ్లంతా చైనా వెళ్తున్నారు. అయితే ఇటలీ ఫర్నిచర్ తో పోలిస్తే, కంపారిటివ్ గా చైనా ఫర్నిచర్ రేటు తక్కువ. 

కానీ ఇటలీ ఫర్నిచర్ సోయగాలే వేరు. సినిమా మేకింగ్ విషయంలో రాజీపడని త్రివిక్రమ్ తన స్వంత ఇంటి విషయంలో రాజీ పడతారా? అందుకే ఇటీవల ఇంటి డిజైన్లు, డ్రాయింగ్ లతో ఇటలీ వెళ్లి, అక్కడ ఫర్నిచర్ డిజైన్లు, ఇంటీరియర్ డిజైన్లు అన్నీ చూసి వచ్చారని తెలుస్తోంది. మరి ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? ఏ మేరకు అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.