అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు – హాస్యాస్పదం!

ప్రపంచంలో అందరికీ ఉన్న అద్భుతమైనది ఓటు హక్కు. రాచరికాలుపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాక అనేకమార్పులకి లోనై మొదట పురుషులకే, కొన్ని వర్గాలవారికే ఉన్న ఓటు హక్కుని అనేక పోరాటాల అనంతరం ఈ హక్కుని…

ప్రపంచంలో అందరికీ ఉన్న అద్భుతమైనది ఓటు హక్కు. రాచరికాలుపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాక అనేకమార్పులకి లోనై మొదట పురుషులకే, కొన్ని వర్గాలవారికే ఉన్న ఓటు హక్కుని అనేక పోరాటాల అనంతరం ఈ హక్కుని అందరికి వచ్చిందిప్పుడు.

అంత్యంత వెనుకబడిన దేశాల దగ్గర నుండి అభివృద్ధి చెందిన దేశాల వరకు ఓటుకి ఉన్న విలువ ఒకటే, దానిలో తారతమ్య బేధాలు లేవు. అతి ధనవంతుడు అంబానికైనా నిరుపేద చావ్లా నాయకికైనా ఓటు విలువ ఒక్కటే! ప్రతివాడు అదే లైనులో నిలబడి తమ వంతు వచ్చేవరకు వేచి చూసి అర్థరాత్రి అయినా నిలబడి ఈ హక్కుని ఉపయోగించుకోవాలి – సగర్వంగా! మన ఊరి వార్డ్ ఎన్నిక నుండి అమెరికా అధ్యక్ష ఎన్నిక వరకు ఓటరే మహారాజు. పంచాయితి ప్రెసిడెంటైనా అమెరికా ప్రెసిడెంటైనా ఓటరు ముందు నుంచుని అర్ధించాల్సిందే, ఎదోవిధంగా సదరు ఓటరుని ప్రసన్నం చేసుకోవాల్సిందే. కులమతాలతో, స్థాయి భేదాలతో సంబంధం లేకుండా ప్రతిమనిషీ సగర్వంగా, సర్వస్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల ఒకే ఒక అవకాశం ఈ ఒక్క ఓటు హక్కు మాత్రమే.

ఇలాంటి అంత్యంత విలువైన ఓటు, ఇక్కడ అమెరికా తెలుగు సంఘాల ఎన్నికలలో నవ్వుల పాలవుతున్నది. ఇక్కడ తెలుగు సంఘాలలో ప్రతి సంవత్సరం ఎదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటాయి. ఆయా సంఘాలలో ఉన్న సభ్యులకి అందరి ఇళ్ళకీ బ్యాలెట్లు (ఓట్లు) పంపుతారు. ఆ బ్యాలెట్లు రాగానే మనకి నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసి తిరిగి వాళ్ళిచ్చిన అడ్రసుకి పంపాలి, ఇదీ అసలు జరగాల్సిన పద్దతి. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటంటే ఎప్పుడైతే బ్యాలెట్లు. ఇళ్ళకి పంపుతారో అదే రోజు పోటీ చేసే అభర్ధులు, వాల్ల సహాయకులు ఇళ్ళమ్మట తరిగి ఖాలీ బ్యాలెట్లు అడిగి తీసుకోని వెళ్తారు. ఆ తరవాత వాళ్ళ పానెల్లో వాళ్ళ ఇష్టమొచ్చినోళ్ళకి మన ఓటు వేసుకొంటారు. అదేమీ విచిత్రమో నాకు ఓటు వేయమని ట్రంప్ అయినా మోదీ అయినా అడుగుతారుకానీ, వీళ్ళు మాత్రం మాకు ఖాళీ బ్యాలెట్ ఇవ్వు అని అడుగుతారు. ఇక్కడ మనల్ని ఎవ్వడూ మా వాల్లకి ఓటేసి బ్యాలెట్ మెయుల్ చెయ్యమని అర్ధించరు.

ఇది ఏ ఒక్క తెలుగు సంఘానికో చెందిన విషయం కాదు, అమెరికాలో ఉన్న ప్రతి తెలుగుసంఘం ఎన్నికలలో ఇలాంటి సంఘటనలే. సొంత డబ్బులు పెట్టి వాల్లకి ఇష్టమున్నా లేకున్నా మెంబర్సుగా చేరుస్తారు జస్ట్ ఈ ఎన్నికలకోసమే! ఇలా వాల్ల బ్యాలెట్లు తీసుకెల్లడానికే! 🙂 ఇంకొకటి కూడా చేస్తారు. ఇక్కడ మా ఇల్ల ముందు మెయుల్ బాక్సులుంటాయి, లాకులు ఉండవు. కొంతమంది బ్యాలెట్లు మెయుల్ బాక్సులనుండే దొంగతనంగా ఎత్తుకెల్తారు.ఇది నిజంగా ఫెడరల్ క్రైం, రెండేల్లు జైల్ పడుతుంది. అయినా కక్కుర్తే!

మనం ఎన్నికలప్పుడు అక్కడక్కడా వింటూ ఉంటాం రిగ్గింగ్ చేశారనో లేక కొంతమందిని ఓటు వేయకుండా అడ్డుకున్నారనో. అలాంటి సమయంలో ఇంకా పౌరుషంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవటానికే తీవ్రంగా కృషి చేస్తారు. ఎంతో గర్వపడాల్సిన హక్కుని, అమెరికాలో సో కాల్డ్ చదువుకున్న మేధావులు పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం కాకరకాయ అని కబుర్లు చెప్తూ సొంతంగా ఓటు వేయకుండా ఖాళీ బ్యాలట్లని పోటీ చేసే అభ్యర్థులకే ఇస్తున్నారంటే, ఇంతకంటే బానిసత్వం ఏమైనా ఉంటుదా?

ఇప్పుడు నాటా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సేం టు సేం జరుగుతున్నది. కనీసం ఈ సారన్నా, ఇప్పటి నుండన్నా దయచేసి వాల్ల బ్యాలెట్లని వాల్లు కాపాడుకుని, సొంతంగా ఆలోచించి వాల్లకి నచ్చిన నలుగురు అభ్యర్ధులకి ఓటేసి బాధ్యాతయుతంగా వాటిని మెయుల్ చెయాలి. వాల్ల బ్యాలెట్లు వేరేవకో ఇవ్వడమంటే వాల్లకు వెన్నెముకలేదని, ఎవరికి ఓటెయ్యాలో ఆలోచించే శక్తి లేదని, మొత్తానికి దద్దమ్మలని అర్ధం కాదా!? ఇంకా, ప్యానెలని గ్రూపని ఈ నలుగురికి మీ ఓట్లెయ్యమని అడుగుతారు. కాని, ఒక గ్రూపంతా మంచోల్లు ఇంకో గ్రూపంతా చెడ్డోల్లెలా అవుతారు? కాబట్టి, అభ్యర్ధులందరి ప్రొఫైల్లు చదివి వాల్లలో నలుగురికి ఓటేసి పంపడం ప్రజాస్వామ్యం! ఇంత చదువు చదివి అమెరికాలో ఉన్నత ఉద్యోగాల్లో ఉండి ఎవరో ఇచ్చే ఆజ్ణలని ఎందుకు పాటించాలి? ఊర్లలోని చదువులేనోల్లే వాల్ల ఓటుని వేరేవాల్లకి చూపించెయ్యరు 🙂 దయచేసి ఆలోచించించండి!

గురవా రెడ్డి, అట్లాంటా